Breaking News

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు

Published on Tue, 08/27/2024 - 16:47

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కేజ్రీవాల్‌ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు.

కాగా సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోవైపు  కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన నాల్గో అనుబంధ ఛార్జీషీట్ పైన కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై సెప్టెంబర్ 3న విచారణ జరగనుంది.

కాగా ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్‌ లభించినా సీబీఐ కేసులో బెయిల్‌ రానందున ఆయన తిహార్‌ జైల్లోనే ఉంటున్నారు. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు