Breaking News

నరేంద్ర మోదీ పాత ట్వీట్‌ను జత చేసి.. విరుచుకుపడ్డ కేజ్రీవాల్‌

Published on Sun, 05/21/2023 - 14:19

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్చునిచ్చింది.  ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు  జవాబుదారి అని,  నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు. కాగా,  ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 

దీనిపై ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌  ట్వీట్‌తో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. 2013లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఒక సమస్యపై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మీద ఫైర్‌ అవుతూ ఒక ట్వీట్ చేశారు.

అందులో “పార్లమెంట్ ఏమైనప్పటికీ సమావేశమవుతుంది. కేంద్రం పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకుని మంచి బిల్లు ఇవ్వలేకపోయింది? ఆర్డినెన్స్ ఎందుకు? అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు.  ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని ఉద్దేశించి ఆర్డినెన్స్‌ ఎందుకు సార్‌ అని మోదీ పాత ట్వీట్‌ని జత చేశారు ఢిల్లీ సీఎం . 

‘సేవల’పై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పును నేరుగా సవాల్‌ చేసే విధంగా ఉన్న ఆర్డినెన్స్‌ను కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇటీవల ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం తన అధికారులపై నియంత్రణ కలిగి ఉండాలని తెలిపింది. తాజా తీర్పు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి తప్ప ఎల్‌జీది కాదని తేల్చింది.  ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు  జవాబుదారి అని,  నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు.

మూడు అంశాలు మినహా ఇతర విషయాల్లో ఢిల్లీ సర్కారుకు వేరే రాష్ట్రాలతో సమానంగా అధికారాలుంటాయని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఢిల్లీ పరిపాలన, అధికారుల బదిలీలపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన 10 రోజుల్లోనే.. తాజాగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం బదిలీ, విజిలెన్స్ వంటి అంశాల్లో ఆర్డినెన్స్ జారీ చేసి చట్ట సవరణ చేసింది. అయితే తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో వేచి చూడాల్సిందే.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)