Breaking News

న్యూఢిల్లీ నుంచి మాత్రమే పోటీ చేస్తా

Published on Fri, 01/10/2025 - 05:11

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తానని ఆప్‌ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఓటమి భయంతో తాను న్యూఢిల్లీతోపాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై గురువారం మీడియా సమావేశంలో స్పందించారు. గత ఎన్నికల్లో పోటీ చేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా న్యూఢిల్లీ సీటు నుంచి మాత్రమే మళ్లీ ఉంటానన్నారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్ష ఇండియా కూటమితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈసారి పోటీ ఆప్, బీజేపీల మధ్యే ప్రధానంగా ఉండనుందన్నారు. కేజ్రీవాల్‌కు ఈ దఫా ఓటమి తప్పదు, అందుకే మరో చోటు నుంచి పోటీ చేస్తారంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్‌ అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో చేసిన వ్యాఖ్యలకు పైవిధంగా బదులిచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడు పర్వేశ్‌ వర్మ బీజేపీ నుంచి, మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌పై పోటీ చేస్తుండటం తెలిసిందే.  

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)