Breaking News

కృత్రిమ మేధతో.. కొలువుల కోత

Published on Sun, 11/16/2025 - 04:09

ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి.. కంపెనీలు కృత్రిమ మేధ వినియోగాన్ని వేగవంతం చేయడం. ఏఐలో పెట్టుబడులు పెట్టడం, పెరుగుతున్న వ్యయాలను కట్టడి చేయడంలో భాగంగా కంపెనీలు తమ వ్యాపార విధానాన్ని మార్చుకోవడం కూడా కొలువుల కోతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

ఏఐ అధిక వినియోగం ఉద్యోగుల తీసివేతలకు కారణం అవుతుందని అమెజాన్  సీఈవో ఆండీ జెస్సీ ఈ ఏడాది జూన్ లో జోస్యం చెప్పారు. ఆయన జోస్యం ఆయన కంపెనీ విషయంలో నిజమైంది. సుమారు 14,000 మందికి ఉద్వాసన పలకనున్నట్టు ఇటీవలే అమెజాన్‌ ప్రకటించింది. ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి, ఖర్చులు తగ్గించుకునేందుకు మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం వరకు తొలగించనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ కంపెనీ కూడా ప్రకటించింది. మెటా, టీసీఎస్‌.. ఇలా కంపెనీలు ఒకదాని వెంట ఒకటి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టాయి. 

వారికంటే ఎక్కువ జీతాలు
ఏఐ నైపుణ్యాలున్న కార్మికుల సగటు వేతనాలు.. సంబంధిత రంగంలోని ఇతర ఉద్యోగుల సగటు జీతం కంటే 56% అధికంగా ఉండడం విశేషం. ప్రధానంగా హోల్‌సేల్‌–రిటైల్, ఇంధనం, సమాచారం, రవాణా – నిల్వ, రియల్టీ, తయారీ,  ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ రంగాల్లో ఈ వ్యత్యాసం ప్రధానంగా కనిపిస్తోంది. 

ఏఐ రంగంలో నిపుణుల కొరత వల్లే.. ఈ నైపుణ్యాలకు కంపెనీలు ఎక్కువ విలువ ఇస్తున్నాయని పరిశ్రమ చెబుతోంది. ఈ సంవత్సరం మొత్తం లేఆఫ్‌లలో ఇంటెల్, లెనోవో వంటి హార్డ్‌వేర్‌ కంపెనీల వాటా సుమారు 28%. అమెజాన్, ఈబే తదితర కంపెనీలు 14%, సేల్స్‌ (సేల్స్‌ఫోర్స్‌) 9%, కంజ్యూమర్‌ టెక్‌ (మెటా, గూగుల్‌) సంస్థలు 7% వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పెట్టుబడులు ఇంతింతై..
ప్రపంచవ్యాప్తంగా 2013లో ఏఐ రంగంలో పెట్టుబడులు సుమారు 15 బిలియన్  డాలర్లు కాగా.. 2019 నాటికి 103 బిలియన్‌ డాలర్లకి, 2024కి 252 బిలియన్‌ డాలర్లకి పెరిగాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)