Breaking News

లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు దుర్మరణం

Published on Sat, 01/04/2025 - 15:15

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడిపోవడంతో  నలుగురు సైనికులు మృతి చెందారు. ఇద్దరు సైనికులు ప్రమాదం జరిగిన కాసేపటికే చికిత్స పొందుతూ కన్నుమూయగా,  చికిత్స పొందుతున్న మరో ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. దాంతో చనిపోయిన సైనికుల సంఖ్య 4కు చేరింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. 

శనివారం ఉదయం బాందీపుర(Bandipore) జిల్లా సదర్‌ కూట్‌ పయెన్‌ ప్రాంతంలో సైనికులతో ఓ  ట్రక్కు వెళ్తోంది. అయితే ఒక్కసారిగా అదుపు తప్పి దొర్లుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు.  అయితే పరిస్థితి విషమించి మొత్తంగా నలుగురు సైనికులు చనిపోయినట్లు సీనియర్‌ ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. జమ్ము కశ్మీర్‌లో ఈ తరహా ప్రమాదాలు కొత్తేం కాదు. గతేడాది డిసెంబర్‌లో ఫూంచ్‌ జిల్లాలో ఇదే తరహాలో ఆర్మీ వాహనం పడిపోయి ఐదుగురు సైనికులు మృతి చెందారు. అంతకు ముందు.. నవంబర్‌ నెల 4వ తేదీన రాజౌరీ(Rajaouri)లో జరిగిన యాక్సిడెంట్‌లో ఓ జవాన్‌ చనిపోయాడు. అదే నెల 2వ తేదీన ఓ కారు రెయిసి జిల్లాలో లోయలో పడిపోయి నెలల పసికందు, తల్లి సహా ముగ్గురు మృతిచెందారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)