Breaking News

తోటి సైనికుడిని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం

Published on Sat, 05/24/2025 - 08:16

న్యూఢిల్లీ: తోటి సైనికుడిని కాపాడబోయిన ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయిన విషాదరక ఘటన సిక్కిం(Sikkim)లో చోటుచేసుకుంది. తన బృందంలోని సైనికుడొకరు వాగులో పడి కొట్టుకుపోతుండగా చూసిన ఆర్మీ అధికారి అతడిని కాపాడబోయి, నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే గత ఏడాది డిసెంబర్‌లో నియమితులైన లెఫ్టినెంట్ శశాంక్ తివారీ(23) సిక్కింలోని వ్యూహాత్మక ఆపరేటింగ్ పెట్రోలింగ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. వీరి బృందం కీలక పోస్ట్ వైపు కదులుతుండగా, అగ్నివీర్(Agniveer) స్టీఫెన్ సుబ్బా లాగ్ వంతెనను దాటుతూ, కాలు జారి వాగులో పడిపోయారు. దీనిని గమనించిన లెఫ్టినెంట్ తివారీ నీటిలోకి దూకారు. అతనికి మరో సైనికుడు నాయక్ పుకార్ కటెల్‌ సాయం అందించారు. వారిద్దరూ అగ్నివీర్‌ సుబ్బాను రక్షించగలిగారు.

అయితే సుబ్బాను రక్షించే ప్రయత్నంలో లెఫ్టినెంట్ తివారీ(Lieutenant Tiwari) బలమైన ప్రవాహానికి కొట్టుకుపోయారు. అతని మృతదేహం 30 నిమిషాల తర్వాత 800 మీటర్ల దిగువన కనిపించింది. తివారీకి తల్లిదండ్రులు, సోదరి  ఉన్నారు. కాగా ‘చిన్న వయస్సులోనే ఎంతో తెగువ చూపిన లెఫ్టినెంట్ తివారీకున్న ధైర్యం రాబోయే తరాలకు, సైనికులకు స్ఫూర్తినిస్తుందని భారత సైన్యం పేర్కొంది. ఈ అమరుని మృతదేహం అతని స్వస్థలానికి తరలించే ముందు బెంగ్డుబి మిలిటరీ స్టేషన్‌లో లెఫ్టినెంట్ జనరల్ జుబిన్ ఎ మిన్వాల్లా పూర్తి సైనిక గౌరవాలు అందించారని సిలిగురికి చెందిన 33 కార్ప్స్ (త్రిశక్తి కార్ప్స్) ‘ఎక్స్‌’లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: 43 ఏళ్ల న్యాయపోరాటం.. 104 ఏళ్ల వృద్ధునికి జైలు నుంచి విముక్తి

#

Tags : 1

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)