Breaking News

సరిహద్దుల్లో చొరబాట్లను నిలువరించి.. ఆర్మీ జేసీవో వీరమరణం

Published on Sun, 04/13/2025 - 06:28

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద చొరబాటుదార్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌(జేసీవో)వీర మరణం పొందారు. అఖ్నూర్‌ సెక్టార్‌లోని కేరి భట్టాల్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు ఒక ప్రవాహం వద్ద సరి హద్దులు దాటేందుకు యత్నించారు. 

బలగాలు చేస్తున్న హెచ్చరికలను వారు ఖాతరు చేయలేదు. ఈ సందర్భంగా భీకర ఎదురు కాల్పులు కొనసాగాయి. ఘటనలో జేసీవో సుబేదార్‌ కుల్దీప్‌ చాంద్‌ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. సైన్యం దీటుగా స్పందించగా తోకముడిచిన తీవ్రవాదులు ఆక్రమిత కశ్మీర్‌లోకి పలాయనమయ్యారు. 

సుబేదార్‌ కుల్దీప్‌ సింగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన వారు. కాగా, బలగాలను భారీగా తరలించి, ఆ ప్రాంతాన్ని దిగ్బంధించామని అధికా రులు వివరించారు. భారత్, పాక్‌ బ్రిగేడియర్‌ కమాండర్‌ స్థాయి అధికారుల ఫ్లాగ్‌ మీటింగ్‌ జరిగిన రెండు రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇదే ప్రాంతంలో ఫిబ్రవరి 11వ తేదీన ఉగ్ర వాదులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ముష్కరులతో జరిగిన పోరులో నేలకొరిగిన కుల్దీప్‌ సింగ్‌ చాంద్‌కు జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఘనంగా నివాళులర్పించారు. ఆయన త్యాగం వెల కట్టలేదన్నారు.

ఇద్దరు ఉగ్రవాదులు హతం
భారీగా మంచుకురుస్తున్న కిష్టవార్‌ జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవా దులు హతమైనట్లు శనివారం అధికారులు తెలిపారు. దీంతో, ఛత్రు ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఉగ్రవాదులను ఏరివేసినట్లయిందన్నారు. టాప్‌ కమాండర్‌ సైఫుల్లా సహా ఈ ముగ్గురూ పాక్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్‌కు చెందిన వారేన న్నారు. వీరి వద్ద అత్యాధుని ఎం–4 కార్బైన్, ఏకే సిరీస్‌ రైఫిళ్లను, భారీగా పేలుడు సామగ్రి ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నెల 9వ తేదీన చేపట్టిన గాలింపు చర్యలు కొనసా గిస్తున్నామని స్పష్టం చేశారు. ఉధంపూర్‌ జిల్లాలోని బసంత్‌గఢ్, రామ్‌నగర్‌ ప్రాంతాల్లో నూ బుధవారం నుంచి ఉగ్రవాదుల కోసం గాలింపు మొదలైందని చెప్పారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)