Breaking News

అమర జవాను చితికి నిప్పంటించిన నాలుగేళ్ల చిన్నారి

Published on Sat, 10/26/2024 - 11:00

సిర్సా: కశ్మీర్‌లోని బారాముల్లాలోగల గుల్‌మార్గ్‌లో జరిగిన ఉగ్రదాడిలో హర్యానాకు చెందిన 28 ఏళ్ల ఆర్మీ జవాను జీవన్‌ సింగ్‌ వీరమరణం పొందారు. ఆయన భౌతికకాయం ఆయన స్వస్థలమైన ఘరాకు చేరుకోగా, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అమరవీరుడు జీవన్‌సింగ్‌ మృతదేహం అతని ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.  ఆ అమరవీరునికి నివాళులర్పించేందుకు స్థానికులు పెద్దఎత్తున  తరలివచ్చారు.

కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోని బూటా-పత్రి ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో రైఫిల్‌మెన్ జీవన్ సింగ్ రాథోడ్ వీరమరణం పొందారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు సహా నలుగురు మృతి చెందగా, జీవన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.  ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. నలుగురు సోదరీమణులకు జీవన్ సింగ్ ఏకైక సోదరుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు ఉన్నారు.

జీవన్ సింగ్ 2016లో సైన్యంలో చేరి, రాజ్‌పుతానా రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి, అతని కుమార్తెలు అనన్య, భీషా బోరున విలపించడం అక్కడున్న అందిరినీ కంట తడిపెట్టించింది. గ్రామంలోని శ్మశాన వాటికలో జీవన్‌ సింగ్‌ పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించింది. దీనిని చూసిన అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇది  కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)