Breaking News

CM Rekha Gupta Attack: బీజేపీ ఏఐ ఫొటోపై ఆమ్‌ ఆద్మీ ఫైర్.. అసలు ఫొటో ఇదే..

Published on Thu, 08/21/2025 - 07:34

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి జరిగిన అనంతరం ఈ ఘటన రాజకీయరంగు పులుముకుంటోంది. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సీఎంపై దాడి చేసిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం కలిగినవాడంటూ, అందుకు నిదర్శనంగా నిలిచే ఒక ఫొటోను షేర్‌ చేసిన దరిమిలా ఆప్‌ ఎదురుదాడికి దిగింది.

ఢిల్లీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ ఖురానా సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. దానిలో సీఎంపై దాడి చేసిన సకారియా రాజేష్‌భాయ్.. గుజరాత్‌ ఆప్ ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా పక్కపక్కనే ఉన్నట్లు  కనిపిస్తోంది. ‘ఈ ఫొటో చూసిన తరువాత సీఎంపై దాడికి రాజకీయ మద్దతు ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని’ ఖరానా కామెంట్‌ చేశారు. ‘ఈ ఫోటో వెనుక ఉన్న నిజాన్ని కేజ్రీవాల్ వివరిస్తారా? దయచేసి ఈ సంబంధాన్ని ఏమని పిలుస్తారో వివరించండి’అంటూ ఆయన ప్రశ్నించారు.
 

దీనిపై స్పందించిన ఆప్ గుజరాత్ యూనిట్ ఆ ఫోటో నకిలీదని కొట్టిపారేసింది. బీజేపీ ఒక లింక్ తయారు చేయడానికి కృత్రిమ మేధస్సు  ఉపయోగించిందని ఆరోపించింది.‘ఈ ఫోటో నకిలీది. ఎడిట్‌ చేసినది. ఆప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కృత్రిమ మేధస్సు ఉపయోగించి దీనిని సృష్టించారని గుజరాత్ ఆప్ ప్రతినిధి కరణ్ బారోట్ పేర్కొన్నారు. అలాగే దీనిపై నేరుగా స్పందించిన ఆప్‌ ఎమ్మెల్యే ఇటాలియా బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌ ఖురానాపై మాటల దాడి చేశారు.‘మీరు ఇలాంటి చౌకబారు చేష్టలకు పాల్పడే ముందు, మీ తండ్రి మదన్ లాల్‌కున్న గౌరవం గురించి ఆలోచించలేదా?’ అని ప్రశ్నించారు. కొడుకు చిల్లర చేష్టలు చూస్తే అతను ఏమనుకుంటారు? అని అడిగారు

సీఎం రేఖా గుప్తాపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సకారియా రాజేష్‌భాయ్‌కి సంబంధించిన ఒరిజినల్‌ ఫొటోను ఆప్‌ బయటపెట్టింది. ఈ దాడిని బీజేపీ నేతల కుట్రగా అభివర్ణించింది. నిజానికి ఆమెపై ఎటువంటి దాడి జరగలేదని పేర్కొంది. కాగా సీఎంపై దాడి చేసిన రాజ్‌కోట్ నివాసి సకారియా రాజేష్‌భాయ్‌పై ఢిల్లీ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు  చేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)