Breaking News

కాలుష్య కోరల్లో ఢిల్లీ.. నియంత్రణకు అధికారుల ఆంక్షలు

Published on Sun, 01/14/2024 - 11:35

ఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగింది. పొగమంచుకు గాలి కాలుష్యం తోడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను దాటింది. గాలి నాణ్యతా ప్రమాణాలు తీవ్రమైన ‍ప్రమాదానికి చేరాయి.

దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరగడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) నియంత్రణ చర్యలకు పూనుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో అనవసరమైన నిర్మాణ పనులను నిలిపివేశారు. BS-III, BS-IV డీజిల్ వాహనాల వాడకాన్ని నిషేధించింది. కాలుష్యం నేపథ్యంలో 5వ తరగతి వరకు తరగతులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కమిషన్ సూచించింది. 

"శనివారం సాయంత్రం నుండి దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ కార్యాచరణ కమిటీ ఈ రోజు ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాలుష్య నియంత్రణకు ప్రణాళికను అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఢిల్లీ పరిసర ప్రాంతంలో తక్షణమే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.” అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

  • రోడ్లు, కాలుష్యం తీవ్రంగా ఉండే ప్రదేశాల్లో నీటిని చిలకరించేలా చూడండి
  • ప్రజా రావాణా సేవలను ఎక్కువగా ఉపయోగించుకోండి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి
  • అత్యవసరమైన ప్రాజెక్టులు మినహా.. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను తగ్గించండి.
  • స్టోన్ క్రషర్స్‌ ఆపరేషన్‌ను మూసివేయండి
  • ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని నిలిపివేయండి
  • BS-III పెట్రోల్, BS-IV డీజిల్ LMVలపై కఠినమైన పరిమితులను విధించండి.
  • నాల్గవ తరగతి వరకు పిల్లలకు భౌతిక తరగతులను నిర్వహించకండి. ఆన్‌లైన్‌లో బోధించండి. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్‌ నేత గుడ్‌ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు..

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)