Breaking News

శ్రుతి జీవితంలో మరో పెను విషాదం

Published on Thu, 09/12/2024 - 07:28

వయనాడ్‌ విలయంతో కుటుంబాన్ని కోల్పోయిన ఆమెకు.. కాబోయేవాడు అండగా నిలిచాడు.  కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు శ్మశానవాటికకు చేరుకొని..  ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఇద్దరూ వివాహంతో ఒక్కటి కావాల్సి ఉంది.ఈ లోపు విధి ఆమెపై మరోసారి కన్నెర్ర చేసింది.

కేరళ వయనాడ్‌ విలయం తర్వాత.. ప్రధాని మోదీ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ టైంలో ఓ యువతి, యువకుడు కలిసి మోదీతో మాట్లాడడం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే.. ఆమెకు అంతటి కష్టం వచ్చింది కాబట్టి. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యుల్ని పొగొట్టుకుందామె.

చూరాల్‌మల గ్రామానికి చెందిన శ్రుతి (24)కి తన చిరకాల మిత్రుడైన జెన్సన్‌ (27) ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా.. తల్లిదండ్రులు వివాహానికి పచ్చ జెండా ఊపారు. జూన్‌ 2న ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.జూన్‌ 30న వయనాడ్‌ కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ జెన్సన్‌ ఆమెకు అండగా నిలిచాడు. మోదీ పర్యటన టైంలో జాతీయ మీడియా సైతం ఈ జంట గురించి కథనాలు ఇచ్చింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ  నెలలోనే రిజిస్టర్‌ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.అయితే..

వివాహ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌ 10న శ్రుతి, జెన్సన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు. కోజికోడ్‌ కొల్లేగల్‌ జాతీయ రహదారిపై వీరి వాహనం, ఓ ప్రైవేట్‌ బస్సు ఢీకొన్నాయి. జెన్సన్‌ తీవ్రంగా గాయపడగా, శ్రుతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ జేన్సన్‌ బుధవారం రాత్రి మరణించాడు. అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన శ్రుతి బాధ వర్ణణాతీతంగా మారింది.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు