Breaking News

నక్సలిజం కొన ఊపిరితో ఉంది: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Published on Wed, 01/22/2025 - 05:32

ఛత్తీస్‌గఢ్‌–ఒడిశా సరిహ­ద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 14 మంది నక్స­లైట్లు మృతిచెందడం మావో­యిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘నక్సలిజానికి మరో పెద్ద ఎదురు­దెబ్బ. దేశాన్ని నక్సల్‌ రహితం చేయాలన్న లక్ష్యం దిశగా భద్రతాబలగాలు పెద్ద విజయం సాధించాయి. సీఆర్పీఎఫ్, ఒడిశా స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా ఇదొక ముందడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది..’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

2026 నాటికి అంతం చేస్తాం: ఛత్తీస్‌గఢ్‌ సీఎం
కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న డబుల్‌ ఇంజన్‌ సర్కారు నక్సలిజం అణచివేతను విజయవంతంగా కొనసాగిస్తోందని ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ పేర్కొన్నారు. ‘2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తాం. ఆ దిశగా భద్రతా దళాలు ముందుకెళుతున్నాయి’ అని ఆయన తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)