Breaking News

కోర్టు విచారణలో అర్జంట్‌గా బాత్రూమ్‌ వెళ్లాల్సి వస్తే ఎలా?

Published on Fri, 06/27/2025 - 16:12

న్యాయవ్యవస్థపై కనీస గౌరవం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఓ ఘటనపై చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. ఏకంగా టాయిలెట్‌ సీటుపై నుంచే వర్చువల్‌ కోర్టు విచారణకు హాజరు కాగా, ఆ తతంగం అంతా రికార్డు అయ్యింది కూడా. అయితే కోర్టు విచారణలో ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి అవసరం పడితే ఎలా మరి?

గుజరాత్ హైకోర్టు వీడియో విచారణకు ఓ వ్యక్తి టాయిలెట్ సీటుపై కూర్చొని పాల్గొన్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జడ్జి నిర్జర్‌ దేశాయ్‌ ఓ చెక్‌బౌన్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ రద్దు కోసం వాదనలు వింటున్నారు. జూమ్‌ కాల్‌ విచారణ(Virtual Hearings) లో టాయిలెట్‌ సీటు నుంచి హాజరైన వ్యక్తి ఫిర్యాదుదారుడే. కానీ జూమ్‌కాల్‌లో పేరు ‘సమద్‌ బ్యాటరీ’ అని ఉంది. 

ఆ వ్యక్తి టాయిలెట్‌ సీటు మీద బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌ ధరించి విచారణలో పాల్గొన్నాడు. ఓ పక్క అవతలి పార్టీ, మరోపక్క కోర్టులో లాయర్‌ వాదనలు వినిపిస్తున్నాడు. ఈలోపు.. ఆ వ్యక్తి ఫోన్‌ నేలపై ఉంచి శుభ్రం చేసుకున్నాడు కూడా. అటుపై మరో గదికి వచ్చి విచారణలో కొనసాగాడు. జూన్ 20వ తేదీ ఈ ఘటన జరిగింది. 

సాధారణంగా ఇలాంటి వ్యవహారాలను న్యాయమూర్తులు అస్సలు ఉపేక్షించరు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే జరగ్గా.. కోర్టులు తీవ్రంగా పరిగణించాయి కూడా. ఈ ఏడాది మార్చిలో.. ఓ వ్యక్తి లావేటరీ నుంచి కోర్టువిచారణకు హాజరు కాగా.. ఆగ్రహించిన జడ్జి ఆ వ్యక్తికి ₹2 లక్షల జరిమానా, కోర్టు ప్రాంగణం శుభ్రం చేయాలని కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించారు. అలాగే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెడ్‌పై పడుకుని విచారణలో పాల్గొన్న వ్యక్తికి ₹25,000 జరిమానా విధించారు. 2020లో ఏకంగా ఓ అడ్వొకేట్‌ విచారణ టైంలో సిగరెట్‌ తాగుతూ న్యాయమూర్తి ఆగ్రహానికి గురయ్యారు. 

అయితే కోర్టులకు హాజరైనప్పడు సరైన వస్త్రధారణ మాత్రమే కాదు.. ప్రవర్తన కూడా సవ్యంగా ఉండాలి.  కోర్టు హాల్‌లో విచారణ జరుగుతున్నప్పుడు గంభీరమైన వాతావరణం ఉంటుంది.  అలాంటి సందర్భాల్లో.. న్యాయమూర్తికి అసహనం కలిగించే పనులు చేయకూడదు. 

ఒకవేళ.. అత్యవసరం పడితే(ఒకటికి, రెంటికి) జడ్జిలకు విజ్ఞప్తి చేస్తే కచ్చితంగా అనుమతిస్తారు. ఒకవేళ సమయం గనుక లేనట్లయితే విచారణ త్వరగతిన పూర్తి చేయాలని లాయర్లకు సూచిస్తారు. వర్చువల్‌ హియరింగ్స్‌(వీడియో కాల్స్‌ విచారణలో)కు ఇదే వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో.. మైక్‌ను మ్యూట్‌లో ఉంచడం, కెమెరాను ఆఫ్‌ చేయడం, లేదంటే తమ లాయర్ల ద్వారా జడ్జిలను రిక్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా గుజరాత్‌ హైకోర్టు ఉదంతంలో అలాంటివేం జరగలేదని తెలుస్తోంది. అంతేకాదు.. సదరు వ్యక్తిపై క్రమశిక్షణా చర్య తీసుకోవడంగానీ, జరిమానా విధిచండంగానీ జరగలేదని సమాచారం.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు