Breaking News

అంగన్‌వాడీ చిన్నారి ‘చికెన్‌ ఫ్రై’ రిక్వెస్ట్‌.. స్పందించిన ప్రభుత్వం

Published on Tue, 02/04/2025 - 12:20

తిరువనంతపురం: అంగన్‌వాడీలో పెడుతున్న తిండి విషయంలో ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఆ దెబ్బకు ప్రభుత్వం కదిలి వచ్చింది. అంగన్‌వాడీ మెనునూ మార్చేయాలని నిర్ణయించింది.

కేరళ అంగన్‌వాడీ సెంటర్లలో మెనూ మార్చే అంశంపై అక్కడి విద్యా శాఖ సమీక్ష జరుపుతోందట. అందుకు కారణం.. శంకూ అనే ఓ చిన్నారి వీడియో వైరల్‌ కావడమే. స్వయానా ఆ రాష్ట్ర ఆరోగ్య, శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్‌( Veena George) ఆ చిన్నారి వీడియోకు స్పందించి.. ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

అం‍గన్‌వాడీలో ప్రతీసారి ఉప్మా పెడుతున్నారని, దానికి బదులు.. బిర్యానీ, చికెన్‌ ఫ్రై కావాలంటూ ఆ చిన్నారి విజ్ఞప్తి చేశాడు. అమాయకంగా ఆ బుడ్డోడు చెప్పిన మాటలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్‌ అయ్యాయి. చివరకు.. ఆ వీడియో ప్రభుత్వం దాకా వెళ్లింది. దీంతో వీణా జార్జ్‌  స్పందించారు.

అంగన్‌వాడీలో పిల్లలకు ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. ఇప్పటికే పాలు గుడ్లు అందిస్తున్నాం. అయితే.. చిన్నారి శంకూ చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. మెనూను కచ్చితంగా సమీక్షిస్తాం. ఆ వీడియోను చూశాక.. చాలామంది మాకు ఫోన్లు చేశారు. అతనికి బిర్యానీ, చికెన్‌ ఫ్రై ఇప్పిస్తామని అన్నారు. అంగన్‌వాడీలో పిల్లలకు అన్నిరకాల పోషకాలు అందాల్సిన అవసరం ఉంది. అందుకే మెనూలో మార్పులు తప్పకుండా చేస్తాం అని అన్నారామె.

అయితే.. అవసరమైతే జైల్లో ఖైదీలకు అందించే పెట్టే ఫుడ్‌ను తగ్గించి.. ఇలాంటి పిల్లలకు పెట్టాలంటూ ఆమె కామెంట్‌ సెక్షన్‌లో కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)