Breaking News

Amit Shah: త్వరలో ఉగ్రవాద వ్యతిరేక విధానం

Published on Fri, 11/08/2024 - 05:15

న్యూఢిల్లీ: ఉగ్రవాదులను ఏరిపారేయడంతోపాటు వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. త్వరలో జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పటిష్టమైన వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఉగ్రవాద నియంత్రణపై గురువారం ఢిల్లీలో జరిగిన సదస్సులో అమిత్‌ షా మాట్లాడారు. 

రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా, నిఘా సంస్థల అధినేతలు పాల్గొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, రాష్ట్రాలు భౌతికమైన సరిహద్దులు కలిగి ఉన్నప్పటికీ, రాజ్యాంగపరంగా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఉగ్రవాదానికి అలాంటి సరిహద్దులు, పరిమితులు ఉండవని అమిత్‌ షా గుర్తుచేశారు. అందుకే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

 ఉమ్మడి వ్యూహాలు, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, పరస్పర సమన్వయం వంటి చర్యలు అవసరమని సూచించారు.  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం మోడల్‌ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్‌ (ఏటీఎస్‌), మోడల్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) తీసుకు రావాలని యోచిస్తు న్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఎదిరించడానికి ఇవి ఉమ్మడి వేదికలుగా ఉపయోగపడతాయని పేర్కొ న్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న యాంటీ–టెర్రరిజం పాలసీ, స్ట్రాటజీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)