Breaking News

బోడో ఒప్పందంతో శాంతి, అభివృద్ధి

Published on Mon, 03/17/2025 - 06:06

గౌహతి/కొక్రాఝర్‌: బోడో ఒప్పందాన్ని అమలు చేసి ఈ ప్రాంతంలో శాంతిని, అభివృద్ధిని సుసాధ్యం చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. బోడోలాండ్‌ టెరిటోరియల్‌ రీజియన్‌(బీటీఆర్‌)లోని యువత నేడు తుపాకులకు బదులుగా త్రివర్ణ పతాకాన్ని ధరించారని ఆయన తెలిపారు. 2020లో బోడో ఒప్పందం కుదరడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి ప్రకటించారు. ఆదివారం ఆయన అస్సాంలోని కొక్రాఝర్‌ జిల్లా దొట్మాలో ఆల్‌ బోడో స్డూటెండ్స్‌ యూనియన్‌(ఏబీఎస్‌యూ) 57వ వార్షిక భేటీని ఉద్దేశించి ప్రసంగించారు.

ఒప్పందం విషయంలో ఏబీఎస్‌యూ చూపిన చొరవ ఫలితంగానే నేడు శాంతియుత పరిస్థితులు సాధ్యమయ్యాయని చెప్పారు. లేకుంటే, బీటీఆర్‌లో శాంతి లేదు, బోడో ఒప్పందం ఒక జోక్‌ అంటూ కాంగ్రెస్‌ ఎద్దేవా చేసి ఉండేదని ఆయన అన్నారు. ఒప్పందంలోని 82 శాతం షరతులను ఇప్పటికే అమలు చేశామని, వచ్చే రెండేళ్లలో 100 శాతం పూర్తవుతుందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) నుంచి పూర్తిగా మినహాయించామని వివరించారు.

మూడేళ్లలోనే ఎన్‌డీఎఫ్‌బీ సభ్యులు 4,881 మంది లొంగిపోయారని, వీరి పునరావాసానికి రూ.287 కోట్లు వెచ్చించామని ఇందులో 90 శాతం కేంద్రమే సమకూర్చిందని వివరించారు. 2020 జనవరి 27న ఏబీఎస్‌యూ, ఎన్‌డీఎఫ్‌బీ తదితర బోడో గ్రూపులతో కేంద్రం బోడో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే. 

నేర చట్టాల అమలుపై అమిత్‌ షా సమీక్ష 
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం కొత్తగా అమల్లోకి వచి్చన నేర చట్టాలు బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్, బీఎస్‌ఏ చట్టాలు ఈశాన్య రాష్ట్రాల్లో అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఉండటంతో ఆ రాష్ట్రం తరఫున గవర్నర్‌ అజయ్‌ భల్లా హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోపాటు డీజీపీలు హాజరయ్యారు.   

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)