Breaking News

కరోనా విజృంభించొచ్చు.. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Published on Thu, 03/16/2023 - 19:27

న్యూఢిల్లీ: భారత్‌లో మరోసారి కొత్త వేరియెంట్‌ రూపేణా కరోనా విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. మరోవైపు ఫ్లూ కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. హఠాత్తుగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున.. అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ మీద దృష్టిసారించాలని ఆ లేఖలో పేర్కొంది. 

మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు బుధవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖలు రాశారు. టెస్టుల సంఖ్యను పెంచాలని, చికిత్స, ట్రాకింగ్‌తో పాటు వ్యాక్సినేషన్‌ పైనా దృష్టిసారించాలని ఆరోగ్య శాఖ లేఖల్లో ఆయా రాష్ట్రాలను కోరింది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, కాబట్టి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది ఆరోగ్య శాఖ. ఈ పర్యవేక్షణ కేత్ర స్థాయి (గ్రామాలు, మండలాలు, జిల్లాలు) నుంచే కొనసాగాలని, కోవిడ్‌-19 నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకే కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 

ఇదిలా ఉంటే.. గత శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ సైతం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని  అప్రమత్తంగా ఉండాలని కోరారాయన.

చివరగా.. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా నవంబర్‌ 12వ తేదీన 734 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత.. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత బుధవారం 700కి పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేల(4,623) పైకి చేరింది. యాక్టివ్‌ కేసుల శాతం 0.01 శాతంగా ప్రస్తుతానికి ఉండగా, రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది.

దేశంలోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్‌ ఇదే!

Videos

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై మరో అక్రమ కేసు బనాయింపు

IPL మ్యాచ్ లు ఎలా షూట్ చేస్తారు? తెరవెనుక రహస్యాలు..!

మిస్ వరల్డ్ వివాదం 2025.. పోటీ నుండి తప్పుకున్న బ్రిటిష్ బ్యూటీ.. కారణం అదేనా..!

YSRCP నేతలను చావబాదడమే నా టార్గెట్

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. రంగంలోకి వైఎస్సార్సీపీ నేతలు

రైతులపై సోలార్ పిడుగు

కరోనా వచ్చినా.. I Don't Care.. నా సభే ముఖ్యం..!

ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం

ఆ నలుగురితో నాకు సంబంధం లేదు..!

మూడు రోజులు భారీ వర్షాలు..

Photos

+5

'భైరవం' ప్రీ రిలీజ్ లో ఫ్యామిలీ తో సందడి చేసిన మంచు మనోజ్ (ఫొటోలు)

+5

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)