Breaking News

హైదరాబాద్‌లో యుద్ధ విమానం తయారీ..సత్తా చాటిన ‘వెమ్‌ టెక్నాలజీస్‌’

Published on Sun, 02/09/2025 - 19:02

బెంగళూరు: ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా-2025 ఎగ్జిబిషన్‌లో ఈసారి హైదరాబాద్‌కు చెందిన రక్షణ రంగ కంపెనీ వెమ్‌ టెక్నాలజీస్‌ సత్తా చాటనుంది. డీఆర్డీవోతో కలిసి వెమ్‌ టెక్నాలజీస్‌ తయారుచేసిన అత్యాధునిక అడ్వాన్స్‌డ్‌ మీడియం కం‌బ్యాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఏఎంసీఏ) యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఏరో ఇండియా షో ప్రారంభంలో భాగంగా ఫిబ్రవరి 10న ఆవిష్కరించనున్నారు.

వెమ్‌ టెక్నాలజీస్‌ ‘ఏఎంసీఏ’ యుద్ధ విమానంలోని కీలక మాడ్యూల్స్‌ను తయారు చేయడమే కాకుండా పూర్తి విమానాన్ని హైదరాబాద్‌లోనే అసెంబుల్‌ చేసింది. యుద్ధ విమానాల ఫ్యుసిలేజ్‌లు,జనరేటర్ల తయారీలో వెమ్‌ టెక్నాలజీస్‌ పేరు గాంచింది. రక్షణ రంగ విమానాలు, హెలికాప్టర్లకు అవసరమైన ఆన్‌ బోర్డ్‌ సిస్టమ్‌లను కూడా వెమ్‌ తయారు చేస్తోంది. 

ఇండియన్‌ ఆర్మీ,నేవీ,ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన పలు రకాల వెపన్‌ సిస్టమ్స్‌ను కూడా కంపె‌నీ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేస్తుండడం విశేషం. ఇటీవలే యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ ‘అసీబల్‌’ను వెమ్ అభివృద్ది చేసింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్‌ రోజురోజుకు వృద్ధి చెందుతోందనడానికి ‘ఏఎంసీఏ’ యుద్ధ విమానం పూర్తిగా ఇక్కడ తయారవడమే నిదర్శనమని పలువురు రక్షణరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)