Breaking News

Air India Plane Crashed: ప్రమాదాన్ని తొలుత చూసింది ఇతనే.. వెంటనే ఏం చేశారంటే..

Published on Sun, 06/15/2025 - 08:53

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయినవారిని పోగొట్టుకున్నవారి ఆవేదన వర్ణనాతీతం. అయితే ఈ ప్రమాదాన్ని తొలుత ఎవరు చూశారు? ఎలా స్పందించారు?.. అనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు.

108 అంబులెన్స్ డ్రైవర్ సతీందర్ సింగ్ సంధు మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ మెస్‌లో భోజనం చేస్తుండగా, అతనికి భారీ పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే క్యాంపస్‌లోని హాస్టళ్లవైపు దృష్టి సారించి, హడలెత్తిపోయాడు. దట్టమైన నల్లటి పొగ  కమ్ముకోవడాన్ని గమనించాడు.  ఆ ప్రదేశానికి పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా, విమానం కూలిపోయి మంటల్లో దగ్ధమవడాన్ని గమనించాడు. వెంటనే అప్రమత్తమై, అంబులెన్స్ సర్వీస్ మేనేజర్ జితేంద్ర షాహికి ఫోన్‌ చేశాడు. ‘ఇక్కడ విమాన ప్రమాదం జరిగినట్లుంది. అగ్నిమాపక దళాన్ని వెంటనే పంపండి’ అని కోరాడు.

ప్రమాద స్థలంలో తీవ్రంగా కాలిపోయిన భద్రతా సిబ్బందిని సంధు తొలుత చూశాడు. అలాగే విమాన ప్రమాదం  నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి (విశ్వాస్ కుమార్ రమేష్)ని కూడా చూశాడు.. రమేష్‌ అదే విమానంలో ఉన్న తన బంధువును కాపాడేందుకు ప్రయత్నించడాన్ని కూడా తాను చూశానని సంధు మీడియాకు తెలిపారు. తరువాత అతనిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.46 గంటలకు ఐదు 108 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయని, తొలుత తాము హాస్టల్ నుండి బయటకు వస్తున్న  20 మంది బాధితులను  ఆస్పత్రులకు తరలించామని షాహి తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇరాన్‌ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్‌ చిత్రాలలో.. 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు