Breaking News

బీఎస్పీ నేత దారుణ హత్య

Published on Sat, 01/25/2025 - 07:22

అంబాలా: హర్యానాలోని అంబాలాలో దారుణం చోటుచేసుకుంది. అంబాలా పరిధిలోగల నారాయణ్‌గఢ్ నుండి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన హర్‌విలాస్ రజ్జుమాజరాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.  

హర్‌విలాస్ రజ్జుమాజరా కారుపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో హర్‌విలాస్‌ మృతిచెందగా, అతని ముగ్గురు సహచరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చండీగఢ్ పీజీఐకి తరలించారు. దాడికి పాల్పడినవారిని ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది. కొన్ని సెకన్ల ఈ వీడియోలో కాల్పుల శబ్దం వినబడటంతోపాటు, కొంతమంది పారిపోతున్న దృశ్యం కనిపిస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి 7:20 గంటల సమయంలో హర్‌విలాస్‌తో పాటు అతని సహచరులు కారులో ప్రయాణిస్తుండగా, కొంతమంది దుండగులు వారిపై కాల్పులు జరిపారు. దీనిని గమనించిన స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ దాడిని బహుజన్ సమాజ్ పార్టీ హర్యానా చీఫ్ ధరంపాల్ టిగ్రా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, కాల్పుల ఘటనలు సాధారణమైపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్‌ షో

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)