అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Published on Sun, 07/19/2026 - 01:55

ప్రతికూల వాతావరణ సూచన దృష్ట్యా ఈ నెల 19వ తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. జూలై 19 నుండి జూలై 23 వరకు ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ తెలిపారు.

పహల్గాం, బల్తాల్‌ మార్గాల ద్వా రా సాగే అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం నుంచి బల్తాల్, నున్వాన్‌/చందన్‌వారీ బేస్‌ క్యాంపుల నుంచి యాత్రికులు ముందుకు వెళ్లడానికి అనుమతించబోమన్నారు.

అదేవిధంగా జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి బేస్ క్యాంపులకు వెళ్లే ఎలాంటి అమర్‌నాథ్ యాత్రికుల కాన్వాయ్‌లను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ పుణ్యయాత్రలో ఇప్పటివరకు 3.76 లక్షలకు పైగా భక్తులు అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకున్నారు. మొత్తంగా ఈ యాత్ర 57 రోజుల పాటు సాగనుంది. మరోవైపు ఈ హెచ్చరికల నేపథ్యంలో వైష్ణోదేవి యాత్రను  కూడా అధికారులు నిలిపివేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)