Breaking News

శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం

Published on Fri, 07/04/2025 - 19:29

లక్నో: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ మసీదును వివాదాస్పద కట్టడంగా పరిగణించాలన్న అభ్యర్థనను అలహాబాద్‌ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్‌) శుక్రవారం కొట్టేసింది. మథురలో శ్రీకృష్ణ జన్మభూమి నేపథ్యంగా సాగుతున్న కేసులో భాగంగా.. ఈ పిటిషన్‌ సైతం దాఖలైంది.

షాహీ ఈద్గా అక్రమ కట్టడమని, కాబట్టి వివాదాస్పద స్థలంగా ప్రకటించాలని, ఈ కేసు విచారణ ముగిసే దాకా కోర్టు రికార్డుల్లో అలాగే ప్రస్తావించేలా కోర్టు సిబ్బందిని ఆదేశించాలని హిందూ సంఘాల తరఫున మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ ఈ పిటిషన్‌ వేశారు. అయితే ముస్లిం సంఘాల తరఫు లాయర్‌ ఈ అభ్యర్థనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ ఈ పిటిషన్‌ను కొట్టేసింది.

శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో వివిధ హిందూ సంఘాలు కోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్‌లో శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో,కోర్టు పత్రాల్లో భవిష్యత్ విచారణలలో షాహీ ఈద్గా మసీదు అనే పదాన్ని ఉపయోగించకుండా, దాని స్థానంలో వివాదాస్పద నిర్మాణం అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశించమని పేర్కొన్నారు. ఇదే పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టంది. తదుపరి విచారణ ఆగస్టు 2కి వాయిదా వేసింది. 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)