Breaking News

ప్రపంచ స్థాయి భద్రత

Published on Tue, 09/05/2023 - 05:20

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9, 10వ తేదీల్లో జరుగనున్న శిఖరాగ్ర సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కలి్పస్తారని కేంద్రం వెల్లడించింది.

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సహా, విదేశీ నేతలకు సంబంధించిన భద్రత కోసం సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) కమెండోలను నియమించారు. వీరికి అదనంగా పారామిలిటరీ బలగాలు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) సైతం భద్రతా చర్యల్లో పాలుపంచుకోనున్నాయి. అదనంగా, ప్రపంచ నాయకుల జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతను సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ) దళాలకు అప్పగించారు. అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (సీఐఏ), చైనా భద్రతా శాఖ (ఎంఎస్‌ఎస్‌), యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన  ఎంఐ–6, ఇతర విదేశీ గూఢచార సంస్థలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి.  
 
రాఫెల్‌లు.. హెలికాప్టర్‌లు.. యాంటీ డ్రోన్‌లు  
దేశాధినేతల భద్రతా వ్యవస్థలో బాగంగా గగనతల దాడులను సైతం సమర్థంగా ఎదుర్కొనేలా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌), ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీఎస్‌), ఇతర ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకున్నాయి.  అత్యవసర సమయాల్లో ఎన్‌ఎస్‌జీ కమెండోలు, ఐఏఎఫ్‌ సిబ్బందిని తరలించేలా హెలికాప్టర్లను మోహరించింది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలలో సమగ్ర ఏరోస్పేస్‌ రక్షణ కోసం ఇప్పటికే పారాగ్లైడర్లు, పారామోటర్లు, హ్యాంగ్‌–గ్లైడర్లు, మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రిమోట్‌గా పైలట్‌ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లు, చిన్న విమానం, క్వాడ్‌కాప్టర్లు నిర్వహణను నిషేధించారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు