Breaking News

‘కుంభమేళా’ మృతుల సంఖ్యను దాచిపెడుతున్నారు

Published on Wed, 02/05/2025 - 04:52

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో చాలామంది చనిపోయారని, వారి సంఖ్యను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌  యాదవ్‌ ఆరోపించారు. మృతుల సంఖ్యపై ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఆయన మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. కుంభమేళాను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు. అక్కడ జరిగిన వైఫల్యాల సంగతి బయటకు రాకుండా తొక్కిపెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డిజిటల్‌ కుంభమేళా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మృతుల సంఖ్యను మాత్రం బయటపెట్టడం లేదని మండిపడ్డారు.

‘బడ్జెట్‌ సంఖ్యల గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కుంభమేళా తొక్కిసలాట మృతుల లెక్కలు చెప్పండి’ అని అఖిలేశ్‌ యాదవ్‌ నిలదీశారు. ఒకవైపు మృతదేహాలు మార్చురీలో ఉంటే, మరోవైపు కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై హెలికాప్టర్‌ ద్వారా పూలు చల్లారని, ఇదెక్కడి సనాతన సంప్రదాయమని ధ్వజమెత్తారు. జేసీబీలతో మృతదేహాలను నదిలోకి నెట్టేశారని ఆరోపించారు. కుంభమేళాలో ఎంతోమంది భక్తులు చనిపోతే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కనీసం విచారం వ్యక్తం చేయలేదని విమర్శించారు. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుంభమేళాలో భద్రతా ఏర్పాట్లు చూసే బాధ్యతను సైన్యానికి అప్పగించాలని సూచించారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)