Breaking News

ఆర్థిక నేరాలకు ఈడీ విచారణ అవసరం లేదు

Published on Thu, 04/17/2025 - 06:14

భువనేశ్వర్‌: ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ అవసరం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ చెప్పారు. విచారణ కోసం ఇతర దర్యాప్తు సంస్థలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మిగతా రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ఈడీని ఏర్పాటు చేశారని అన్నారు. ఈడీ ఇప్పుడు ఎన్నో రకాలుగా వివాదాల్లో చిక్కుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను పక్కనపెట్టడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరాలపై విచారణకు ఆదాయపు పన్ను శాఖ వంటి విభాగాలు ఉండగా ఈడీ ఎందుకని ప్రశ్నించారు. 

అఖిలేష్‌ యాదవ్‌ బుధవారం ఒడిశాలోని భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈడీ అవసరం ఇప్పుడు లేదని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. భుశనేశ్వర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్‌ జెనా నివాసానికి అఖిలేష్‌ వెళ్లారు. దీంతో శ్రీకాంత్‌ జెనా సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, అందులో వాస్తవం లేదని వారిద్దరూ స్పష్టతనిచ్చారు.    

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)