Breaking News

అజిత్‌ పవార్‌కు చేదు అనుభవం

Published on Wed, 07/05/2023 - 06:26

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) చీలికవర్గం నేత అజిత్‌ పవార్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్రవాది భవన్‌ను పార్టీ వ్యవహారాల కోసం నూతన కార్యాలయంగా వాడుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి అజిత్‌ పవార్‌ వర్గం నేతలు మంగళవారం అక్కడికి వెళ్లగా తలుపులకు తాళంవేసి ఉండడంతో నిరాశ చెందారు.

కొందరు యువకులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ లోపలి గదులకు తాళాలు వేసి ఉండడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రవాది భవన్‌లో గతంలో మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన అంబదాస్‌ దన్వే నివసించారు. ప్రభుత్వం మరో భవనం కేటాయించడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలాఉండగా, అసలైన ఎన్సీపీ తమదేనని అజిత్, శరద్‌ పవార్‌ వర్గాలు వాదిస్తున్నాయి. ఏ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Videos

తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్..!

మాట ఇచ్చి తప్పింది మీరు మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..?

అమెరికా రక్షణ శాఖలో తీవ్ర కలకలం!

నేపాల్ వరదల్లో చిక్కుకున్న బాధిత ఫ్యామిలీ ఆవేదన

మంత్రి పదవి ఊస్ట్ హుటాహుటిన ఢిల్లీకి కొండా సురేఖ

రాజమండ్రి సెంట్రల్ జైలుకు సాధిక్ ఖాన్ తరలింపు

Hyderabad: దొంగలు బాబోయ్ దొంగలు

Kadapa : YSRకు వైఎస్ జగన్ ఘన నివాళి

గాలి భాను ప్రకాష్ క్వారీలపై రోజా సంచలన వ్యాఖ్యలు

Hyd: సెప్టెంబర్ లోనూ ఇంతే.. వర్షాలపై IMD హెచ్చరిక

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)