Breaking News

సొంత ఖాతాలోకి రూ. 232 కోట్లు బదిలీ

Published on Wed, 09/03/2025 - 05:56

జైపూర్‌: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉద్యోగి ఒకరు రూ.232 కోట్లు స్వాహా చేశారు. జైపూర్‌ విమానాశ్రయంలో ఫైనాన్స్‌ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న రాహుల్‌ విజయ్‌.. గతంలో డెహ్రడూన్‌ విమానాశ్రయంలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేశాడు. 2019–20, 2022–23 మధ్య కాలంలో అధికారిక, ఎలక్ట్రానిక్‌ రికార్డులను తారుమారు చేస్తూ పథకం ప్రకారం మోసానికి పాల్పడ్డాడు. నకిలీ, కల్పిత ఆస్తులను సృష్టించి, వాటి విలువలను పెంచి, కొన్నిసార్లు ఎంట్రీలకు సున్నాలను జోడించి రికార్డులను తారుమారు చేశాడు.

ఆ రికార్డుల నుంచి దాదాపు రూ.232 కోట్ల ప్రజా నిధులను తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించాడు. ఆ తర్వాత నిందితుడు ఆ డబ్బును ట్రేడింగ్‌ ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఈ మోసాన్ని గుర్తించి సీబీఐకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచి్చంది. సీబీఐ అధికారులు ఆగస్టు 28న, జైపూర్‌లోని విజయ్‌ అధికారిక, నివాస ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో స్థిరాస్తులు, విలువైన సెక్యూరిటీలకు సంబంధించిన పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ప్రజా నిధుల దురి్వనియోగం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)