Breaking News

ఇంధనం అందలేదు!

Published on Sun, 07/13/2025 - 06:01

‘ఇంధన నియంత్రణ స్విచ్‌ను ఎందుకు ఆపేశావు?’ – ఆదుర్దాగా ప్రశ్నించిన పైలట్‌

‘నేను ఆపలేదు’ – బదులిచ్చిన రెండో పైలట్‌

దేశమంతటినీ శోకసంద్రంలో ముంచిన అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదానికి క్షణాల ముందు పైలట్ల తుది సంభాషణ ఇది. వారిమధ్య నెలకొన్న అయోమయానికి ఈ సంభాషణ అద్దం పడుతోందని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో పేర్కొంది.

న్యూఢిల్లీ: జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫైన 32 క్షణాల వ్యవధిలోనే రన్‌వేను ఆనుకుని ఉన్న వైద్య కళాశాల భవనాలపై కుప్పకూలడం, 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏఏఐబీ, ఇప్పటిదాకా వెలుగు చూసిన కీలకాంశాలతో రూపొందించిన 15 పేజీల ప్రాథమిక నివేదికను సంస్థ శనివారం విడుదల చేసింది. ‘‘విమానం టేకాఫైనక్షణాల్లోనే రెండు ఇంజన్ల తాలూకు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఒక్క సెకన్‌ వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటి ‘రన్‌’ నుంచి ‘ఆఫ్‌’ మోడ్‌కు మారిపోయాయి. దాన్ని గమనించగానే పైలట్లు పరస్పరం ప్రశ్నలు సంధించుకున్నారు.

అప్పటికే ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో విమానం పైకెగిరేందుకు అత్యవసరమైన థ్రస్ట్‌ లభించలేదు. అప్పటికి కేవలం 625 అడుగుల ఎత్తుకు మాత్రమే వెళ్లిన విమానం అక్కణ్నుంచి శరవేగంగా కిందకు దిగడం మొదలైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పైలట్లిద్దరూ శాయశక్తులా ప్రయత్నించారు. తొలుత మొదటి ఇంజన్‌ ఇంధన స్విచ్‌ను, రెండు సెకన్లలోనే రెండో స్విచ్‌ను ఆన్‌ చేసినా లాభం లేకపోయింది. మొదటి ఇంజన్‌ కాసేపు రికవరీ అయినట్టే కనిపించినా ఆ వెంటనే చేíÙంచిన మీదట ఏఏఐబీ ఈ మేరకు అంచనాకు వచ్చింది

 ‘‘విమానానికి విద్యుత్‌ సరఫరా చేసే ఆగ్జిలరీ పవర్‌ యూనిట్‌ (ఏపీయూ) ఇన్‌లెట్‌ డోర్‌ టేకాఫ్‌ ప్రక్రియ పూర్తవకుండానే అనూహ్యంగా తెరుచుకుంది. ఇంజన్లు మొరాయించిన సమయంలోనే ఇది చోటుచేసుకుంది. విమానం చుట్టూ వాయు ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగల పరిణామమిది!’’ అని వివరించింది. స్విచ్‌లు ఆఫ్‌ కావడానికి ఏఏఐబీ ఎలాంటి కారణమూ పొందుపరచకపోయినా, ‘‘ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆటోమేటిగ్గా పని చేయవు. ఎవరో ఒకరు పూనుకుని వాటిని ఆన్, ఆఫ్‌ చేయాల్సిందే’’ అని చెప్పుకొచ్చింది. తద్వారా, పైలట్లే పొరపాటున ఆ పని చేసి ఉంటారనే సంకేతాలిచ్చింది.

అంతా 32 సెకన్లలోపే...
ఇదీ ప్రమాదక్రమం...
⇒ ఉదయం 11.17: ఢిల్లీ నుంచి
⇒ అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ఎయిరిండియా విమానం
⇒ మధ్యాహ్నం 1.38:39: రన్‌వే నంబర్‌ 23 నుంచి టేకాఫ్‌ అయిన విమానం

⇒ మధ్యాహ్నం 1.38:42: టేకాఫై 180 నాట్ల ఐఏఎస్‌ వేగం అందుకున్న విమానం. అదే సమయంలో ‘రన్‌’ పొజిషన్‌ నుంచి ‘కటాఫ్‌’కు మారిన రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు
⇒ 1.38:47: ఇంధన సరఫరా నిలిచిపోవడంతో రెండు ఇంజన్లూ విఫలమయ్యాయి. దాంతో విమానం పూర్తిగా గాల్లోకి లేచేందుకు కావాల్సిన మినిమం ఇడిల్‌ రేట్‌ను అందుకోలేదు. అందుకు కావాల్సిన హైడ్రాలిక్‌ పవర్‌ అందించేందుకు రామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ (ఆర్‌ఏటీ) పంప్‌ క్రియాశీలమైంది.

⇒ 1.38:52: ఆన్‌ అయిన ఒకటో ఇంజన్‌ స్విచ్‌
⇒  1.38:54: తెరుచుకున్నఏపీయూ ఇన్‌లెట్‌ తలుపు

⇒  1.38:56: ఆన్‌ అయిన రెండో ఇంజన్‌ స్విచ్‌
⇒  1.39:05: పైలట్‌ ప్రమాద (మే డే) సందేశం
⇒  1.39:11: తుది డేటా నమోదు. ఏటీసీ స్పందించేలోపే జనసమ్మర్ధ ప్రాంతంలో నేలను తాకి మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనంపై పడి పేలిపోయిన విమానం

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)