Breaking News

Air India: 20 గంటలు ఆలస్యం.. కేంద్ర మంత్రిత్వశాఖ నోటీసులు

Published on Fri, 05/31/2024 - 15:33

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఇండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి రావడం, ఏసీ కూడా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. 

కొన్ని అనివార్య కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్‌ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే అసలే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యట్లు ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రిత్వశాఖ విమానయాన సంస్థను కోరింది.

కాగాఎయిరిండియా కు చెందిన బోయింగ్‌ 777 విమానం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరాలి.. కానీ దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. రాత్రి 8 గంటలకు రీ షెడ్యూల్‌ చేశారు. సాంకేతిక సమస్యలతో విమానం మార్చారు. దీంతో ప్రయాణికులు రాత్రి 7.20 గంటలకు మరో విమానంలో బోర్డింగ్‌ అయ్యారు. అనంతరం విమానం మళ్లీ ఆలస్యమని ప్రకటన  చేశారు.

అయితే అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్‌ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు.న్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. దీనికితోడు ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు గేట్లు కూడా తెరవకపోవడంతో ప్రయాణికులు దాదాపు గంటపాటు ఏరోబ్రిడ్జిలో వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)