Breaking News

నిలిచిపోయిన విమానం.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

Published on Fri, 05/31/2024 - 09:00

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం 8 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులు ఎక్కిన తర్వాత విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఎంతకూ కదలకపోవడంతో  క్యాబిన్‌ లోపల వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

తర్వాత కొద్ది సేపటికి విమానం నుంచి ప్రయాణికులను దిగాల్సిందిగా సిబ్బంది కోరారు. విమానం నుంచి దిగిన వారంతా ఎయిర్‌ పోర్టులోనే పడిగాపులు  కాయాల్సి వచ్చింది.  కొందరు ప్రయాణికులైతే అలసిపోయారు.  

విమానంలో ఎయిర్‌కండీషన్‌ కూడా పనిచేయకపోవడంతో తమ పరిస్థితి మరీ దయనీయంగా మారిందని ప్రయాణికుల్లోని ఓ జర్నలిస్టు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. ఈ పోస్టును విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్‌ చేశారు.

ఎయిర్‌ఇండియా ప్రైవేటైజేషన్‌ పూర్తగా ఫెయిలైందనడానికి ఇది నిదర్శనమని ఫైర్‌ అయ్యారు. ఈ పోస్టుకు స్పందించిన ఎయిర్‌ఇండియా సంస్థ తమ విమానం ఆలస్యమవడంపై విచారం వ్యక్తం చేసింది. 

ఇటీవలే ముంబై నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా విమానం కూడా ఆరు గంటలు ఆలస్యమైంది. ఈ విమానంలో కూడా ఏసీ లేకుండా ప్రయాణికులు ఆరు గంటల పాటు ఇబ్బందులు పడుతూ కూర్చోవాల్సివచ్చింది. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు