Birmingham: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు

Published on Sun, 10/05/2025 - 13:22

బర్మింగ్‌హామ్: ఎయిర్ ఇండియా విమానానికి కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పిన ఉదంతం చోటుచేసుకుంది. భారత్‌లోని అమృత్‌సర్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు బయలుదేరిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానంలో గాలిలో ఉన్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ కోసం విమానం  కిందకు దిగుతున్న సమయంలో దానిలోని అత్యవసర పవర్ యూనిట్ ‘ర్యామ్ ఎయిర్ టర్బైన్’ (ఆర్ఏటీ) ఊహించని రీతిలో తెరుచుకుంది. అయితే, పైలట్లు అప్రమత్తమై ఎంతో చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
 

ఏఐ117 విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు  ఉపక్రమిస్తున్న తరుణంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులుగానీ, సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘అమృత్‌సర్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళుతున్న ఏఐ117 విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో టర్బైన్ తెరుచుకున్నట్లు మా సిబ్బంది గుర్తించారు. అయితే ఆ సమయంలో విమానంలోని  ఇతర వ్యవస్థలన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. మొత్తానికి విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది’ అని  పేర్కొంది.

ల్యాండింగ్‌ అనంతరం విమానంలో నిపుణులతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు  ఎయిర్‌ ఇండియా పేర్కొంది. ఈ అంతరాయం కారణంగా బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ114 విమాన సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. కాగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొంది. సంస్థకు ప్రయాణికుల భద్రతే ముఖ్యమని ఎయిర్ ఇండియా మరోమారు స్పష్టం చేసింది. 
 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)