Breaking News

ఎయిరిండియాలో ఆకస్మిక సమ్మె

Published on Thu, 05/09/2024 - 05:43

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్‌ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్‌ లీవ్‌ పెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామంతో ఎయిరిండియా 100 వరకు దేశీయ, అంతర్జాతీయ సరీ్వసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 

ఫలితంగా, కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరీ్వసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో తెలిపారు. దీంతో, వారు ఎయిరిండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.

 వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజూ 360 సరీ్వసులను నడుపుతోంది. టాటా గ్రూప్‌నకే చెందిన విస్తారాను ఎయిరిండియాతో, అదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఏఐఎక్స్‌ కనెక్ట్‌తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్‌ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్‌ ఉద్యోగుల నైతికతను దెబ్బతీసిందని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ తెలిపింది.

 విమాన సర్వీసుల రద్దుపై బుధవారం కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ నుంచి వివరణ కోరింది.  సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. రద్దయిన సరీ్వసులకు టిక్కెట్‌ చార్జీలను వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్‌ చేస్తామని వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)