Breaking News

భారీ సంఖ్యలో ఎయిరిండియా విమానాలు రద్దు

Published on Fri, 06/20/2025 - 09:17

ఢిల్లీ:  భారీ సంఖ్యలో విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు అయ్యాయి. నిర్వహణ సమస్యల వల్ల 8 విమానాలను రద్దు చేసింది. 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు పూర్తి రీఫండ్, ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పిస్తునట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.

రద్దయిన విమానాలు:
AI906 (దుబాయ్–చెన్నై)
AI308 (ఢిల్లీ–మెల్బోర్న్)
AI309 (మెల్బోర్న్–ఢిల్లీ)
AI2204 (దుబాయ్–హైదరాబాద్)

రద్దయిన డొమెస్టిక్ విమానాలు
AI874 (పుణె–ఢిల్లీ)
AI456 (అహ్మదాబాద్–ఢిల్లీ)
AI2872 (హైదరాబాద్–ముంబై)
AI571 (చెన్నై–ముంబై)

కాగా, జూన్ 21 నుంచి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు వెల్లడించింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత అంతరాయాలతో సతమతమవుతున్న ఎయిరిండియా.. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది. 

ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15 శాతం మేర తాత్కాలికంగా తగ్గించాలని ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది.

ఢిల్లీ-నైరోబి, అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో జూలై 15 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఢిల్లీ-నైరోబి రూట్‌లో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా, అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు చొప్పున విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.

అలాగే.. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియాలోని నగరాలకు కలిపే 16 అంతర్జాతీయ రూట్లలో కూడా విమానా సర్వీసులను తగ్గించారు. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్లలో సర్వీసులను తగ్గించారు.

యూరప్‌లో ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమృత్‌సర్-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్‌హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్‌స్టర్‌డామ్ మార్గాల్లో కూడా విమానాల సర్వీసులను కుదించారు. అలాగే, ఢిల్లీ-మెల్‌బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా, ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) మార్గాల్లో కూడా సర్వీసులను తగ్గించారు.

ఇదిలా ఉండగా, విమాన సర్వీసుల కుదింపుపై ఎయిరిండియా సీఈవో ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. "విమాన ప్రయాణానికి ముందు భద్రతా తనిఖీలను కఠినతరం చేయడం, మధ్యప్రాచ్యంలో గగనతల మార్గాల మూసివేత వల్ల ప్రయాణ సమయం పెరగడం వంటి కారణాలతో ఈ కుదింపులు చేశాం" అని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఆయన ఎయిరిండియా తరఫున ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)