Breaking News

AIIMS Delhi: అయిదేళ్ల చిన్నారికి బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ

Published on Sun, 01/07/2024 - 04:29

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్య నిపుణు లు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న అయిదేళ్ల బాలి కకు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశా రు. అయిదేళ్ల చిన్నారి మెలకువ స్థితిలో ఉండగానే ఇలా ఆపరేషన్‌ చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. ఒకటో తరగతి చదువుకునే అక్షిత అనే అయిదేళ్ల చిన్నారి మూర్ఛలతో బాధపడుతోంది.

పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్యులు ఆమెకు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించి మెదడులో మాట/భా షను నియంత్రించే చోట కణితి(ట్యూమర్‌) ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న న్యూరో సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ దీపక్‌ గుప్తా సారథ్యంలోని న్యూరోసర్జన్ల బృందం శస్త్రచికిత్సకు ఉపక్రమించింది. చిన్నారి మెలకువ స్థితిలోనే ఉంచింది. దీనిద్వారా కణితిలను పూర్తిగా తొలగించేందుకు, నరాల సంబంధిత లోపా లను తగ్గించడానికి తోడ్పడుతుందని డాక్టర్‌ గుప్తా చెప్పారు. నొప్పి కూడా కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

చిన్నారికి ప్రత్యేక నిపుణులు మత్తు మందు ఇ వ్వడం సహా సర్జరీకి ప్రక్రియకు దాదాపు 3 గంటలు పట్టింది. సర్జరీ సమయంలో తాము చూపిన ప్రధాని మోదీ ఫొటోను చిన్నారి గుర్తు పట్టిందన్నారు. శస్త్రచికిత్స ఆసాంతం పూర్తయ్యేదాకా అక్షిత మెలకువ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్‌ దీపక్‌ గుప్తా చెప్పారు. మెలకువగా ఉన్న పరిస్థితుల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ చేయించుకున్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా అక్షిత పేరు ఉంటుందని డాక్టర్‌ గుప్తా తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)