చరిత్ర చెప్పకుండా.. పరువు కాపాడుతూ...

Published on Fri, 08/22/2025 - 06:39

అప్పుడూ.. ఇప్పుడూ.. మనమంతా నెట్టింట్లో ముందు తట్టే తలుపు గూగుల్‌దే. అంతలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరికొన్ని ఫీచర్లను పరిచయం చేసింది.

ఆ మెసేజెస్‌ ‘బ్లర్‌’!
వాట్సాప్‌లో లేని సేఫ్టీ ఫీచర్‌ గూగుల్‌ మెసేజుల్లో ఒకటుంది. తరచూ వాట్సాప్‌ లేదా మరేదైనా మెసేజింగ్‌ యాప్‌లలో తెలియని నంబర్‌ నుంచి మెసేజులు, ఫొటోలు, వీడియోలు వస్తుంటాయ్‌. వాటిలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండొచ్చు. అనుకోకుండా వాటిని ఓపెన్‌ చేసి షాక్‌ అవుతాం. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే.. పరువు పోయినట్టే! అలాంటి ఇబ్బందులు రాకుండా.. అద్భుతమైన ఫీచర్‌ను ‘గూగుల్‌ మెసేజెస్‌’ తీసుకొచ్చింది. అదే ఆటోమేటిక్‌ ‘బ్లర్‌’ ఫీచర్‌. ఇది ‘న్యూడ్‌’ మెసేజ్‌లను ఓపెన్‌ చేస్తే ఆటోమేటిగ్గా బ్లర్‌ చేస్తుంది. సెండర్‌ని కూడా వెంటనే బ్లాక్‌ చేస్తుంది. 

కావాలంటే.. అశ్లీల చిత్రాలు కనిపించకుండా చేసి, సంభాషణ కొనసాగించొచ్చు. అంతేకాదు.. మీరు పొరపాటున అశ్లీలమైన కంటెంట్‌ను పంపితే అలర్ట్‌ చేస్తుంది.  ఇంట్లో పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ చాలా ఉపయోగపడుతుంది. మైనర్లు వాడే ఫోన్లలో ఇది ఆన్‌ చేసి ఉంటుంది. అయితే, వాళ్లు దాన్ని ఆఫ్‌ చేసేందుకు వీలుంది. అందుకే పేరెంటల్‌ కంట్రోల్స్‌ పెట్టాలి. అప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్‌ లేకుండా దాన్ని ఆఫ్‌ చేయడం కుదరదు. అందుకు ఫ్యామిలీ లింక్‌ యాప్‌ ని వాడొచ్చు. దీన్ని మీ ఫోన్లో ఎనేబుల్‌ చేసేందుకు గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ ని ఓపెన్‌ చేయండి. ఈ పాత్‌ ని ఫాలో అవ్వండి. 
Messages Settings > Protection & Safety > Manage sensitive content warnings > Warnings in Google Messages.

‘జెమినై’లో ప్రైవసీ అప్‌డేట్‌
ఏఐ పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో చాట్‌జీపీటీ కంటే ముందే గూగుల్‌ జెమినై (Google Gemini).. ఇన్‌ కాగ్నిటో మోడ్‌ పరిచయం చేసింది. ఏఐ యూజర్ల ప్రైవసీకి ఇదో చక్కని పరిష్కారం. ఇకపై జెమినితో చేసే చాటింగ్, వ్యక్తిగత సమాచారం ఎవరి కంటా పడవు. ఎందుకంటే.. గూగుల్‌ కొత్త ’టెంపరరీ చాట్స్‌’ ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇది మనం బ్రౌజింగ్‌లో వాడే ఇన్‌ కాగ్నిటో మోడ్‌లా పని చేస్తుంది. దీన్ని వాడుకుని జెమినితో మనం చేసే సంభాషణలు సేవ్‌ కాకుండా చూడొచ్చు. మీ కమాండ్‌ ప్రాంప్ట్స్‌ని ఇకపై ఎవరూ కాపీ కొట్టలేరు.  

ఏఐ వాడకంలో ప్రైవసీని కోరుకునే వారికి ఇదో చక్కని ఫీచర్‌. ఇంకా చెప్పాలంటే.. ‘గూగుల్‌ కీప్‌’ సర్వీసులో ఫొటోలు,వీడియోలను జెమిని మీ అనుమతితోనే యాక్సెస్‌ చేసేలా చేయొచ్చు. ఒకవేళ ‘కీప్‌’ డేటా యాక్సెస్‌ ఇవ్వాలంటే ఎప్పుడైనా ఎనేబుల్‌ చేసుకోవచ్చు. అలాగే, జెమినై లైవ్‌ సర్వీసులోనూ ప్రైవసీని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఈ సర్వీసుని వాడే క్రమంలో మీ ప్రమేయం లేకుండా చూపించే ఆడియో, వీడియో సేకరించకుండా చేయొచ్చు.

టూర్‌ ప్లాన్‌ చెప్తే చాలు..
ఏ పని చేయాలన్నా ప్లానింగ్‌ అవసరం. పర్యటనల విషయంలో మరీనూ. ఈ విమాన ప్రయాణం కోసం సరైన ఫ్లైట్లు వెతకడం పెద్ద తలనొప్పి. ఏ వెబ్‌సైట్‌లో వెతకాలి? ఏ యాప్‌లో చూస్తే తక్కువ ధరకి టికెట్టు బుక్‌ చేసుకోవచ్చు? ఏమేం బెటర్‌ ఆఫర్లు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలతోనే గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీ మొత్తం నిండిపోతుంది. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. ఇందుకోసం గూగుల్‌ ఒక సూపర్‌ టూల్‌తో ముందుకొచ్చింది. అదే "Google Flights' లోని కొత్త ఏఐ టూల్‌. ఇది మనతో మాట్లాడుతుంది.

మీరు చేయాల్సిందల్లా ట్రిప్‌ గురించి ఏఐకి చెప్పాలంతే. ‘పదిరోజులు కేరళ ట్రిప్‌కి వెళ్లాలి. మంచి రిసార్టులో ఉండాలి. కాస్త బడ్జెట్‌లో ట్రిప్‌ని ప్లాన్‌ చేయమని అడిగితే చాలు. టూల్‌ అన్ని ఎయిర్‌లైన్స్‌నీ వెతుకుతుంది. బుకింగ్‌ వెబ్‌సైట్లలోని డేటాని క్షణాల్లో జల్లెడ పడుతుంది. అలాగే, ఉండేందుకు తగిన హోటళ్లను కూడా సూచిస్తుంది. బడ్జెట్‌ ప్లానింగ్‌కి తగిన బెస్ట్‌ డీల్స్  చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది బీటా వెర్షన్‌గా అందుబాటులో ఉంది. గూగుల్‌ ఫ్లైట్స్‌ వెబ్‌సైట్‌ www.google.com/travel/flights లేదా యాప్‌ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)