Breaking News

ఢిల్లీ విమానాశ్రయం వద్ద బస్సులో మంటలు

Published on Tue, 10/28/2025 - 15:44

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 3 వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సును ఏఐ శాట్స్‌(టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ ఇండియా లిమిటెడ్-శాట్స్‌లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్) నడుపుతోంది. ఇది ఎయిర్ ఇండియాకు గ్రౌండ్-హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన టెర్మినల్ 3 వద్ద బే 32 సమీపంలో జరిగింది. ఆసమయంలో బస్సు ఎయిర్ ఇండియా విమానానికి కొన్ని అడుగుల దూరంలో టాక్సీవే ప్రాంతంలో ఉంది. సంఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు లేరు.

 


బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో హెచ్చరికలు జారీ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఐజీఐఏ అధికారులు తెలిపారు. వారు మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బస్సులో మంటలు భారీగా ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. అయతే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, విమానాశ్రయంలోని ప్రయాణికులను  భయాందోళనలకు గురిచేసింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)