Breaking News

పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఆదరా బాదరాగా..!

Published on Fri, 06/13/2025 - 21:28

వడోదరా:  అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చిపోయింది. పలు కుటుంబాల్లో దీనగాథను నింపేసింది. 241 కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేసింది. ఈ ప్రమాదం అనంతరం తడిమే కొద్దీ వర్ణణాతీతమైన గాథలే కనిపిస్తున్నాయి. తాజాగా పెళ్లైన రెండు రోజులకే లండన్‌లో ఉద్యోగం కోసం విమానం ఎక్కిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అది ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. 

వడోదరాకు చెందిన భావిక్‌ మహేశ్వరి(26).. రెండు రోజుల క్రితం చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నిమిత్తం రెండు వారాల క్రితం లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన భావిక్‌.. జూన్‌ 10వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అనంతరం లండన్‌లో పని చేస్తున్న భావిక్‌,.. జూన్‌ 12వ తేదీన అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ ఎక్కాడు. 

అంతే అదే అతని ఆఖరి మజిలీ అయ్యింది.  తండ్రితో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలు అయ్యాయి.  ఈ విషయాన్ని పదే పదే తలుచుకుని తండ్రి అర్జున్‌ మహేశ్వరి కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ నా తనయుడు మళ్లీ వస్తానన్నాడు.. లండన్‌ వెళ్లాక ఫోన్‌ చేస్తానన్నాడు. టేకాఫ్‌ టైం అవుతుంది నాన్న అన్నాడు’అని చివరిసారి మాట్లాడిన మాటలు తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన కుమారుడు లండన్‌లో చదువుకని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని, పెళ్లి నిమిత్తం వచ్చి ఇలా మృత్యువాత పడ్డాడని తండ్రి శోకతప్త హృదయంతో మాట్లాడారు.


 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)