Breaking News

కూతురు అరెస్టైనట్లు ఫేక్‌ కాల్‌.. గుండెపోటుతో తల్లి మృతి

Published on Fri, 10/04/2024 - 19:04

లక్నో: ఓ ఫేక్‌ కాల్‌ మహిళ ప్రాణాలు తీసింది. కూతురు వ్యభిచార రాకెట్‌లో అరెస్ట్‌ అయ్యిందని నకిలీ ఫోలీస్‌ అధికారి ఫోన్‌ చేయడంతో.. తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఆగ్రాలో నివాసం ఉంటున్న మహిళ మల్తీ వర్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సెప్టెంబర్‌ 30న పోలీస్‌ అధికారి పేరుతో ఆమెకు ఓ వాట్పాప్‌ కాల్‌ వచ్చింది. ఆమె కుమార్తె సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు చేసినట్లు అతడు తెలిపాడు. ఆ వీడియోలు లీక్‌ చేయకుండా ఉండాలని వెంటనే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

అయితే ఆందోళన చెందిన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే తన కుమారుడు దివ్యాన్షుకు ఫోన్‌ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చెప్పింది. కానీ కుమారుడు తెలివిగా వ్యవహరించి, ఆ కాల్‌  పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఫేక్‌  వాట్సాప్‌ కాల్‌గా  గుర్తించాడు. అంతేగాక వెంటనే తన సోదరికి ఫోన్‌ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు ఆమె చెప్పింది.

మరోవైపు ఈ ఘటన మహిళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా ఆందోళన చెందిన టీచర్‌ మల్తీ వర్మ సాయంత్రం 4 గంటలకు స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే కుప్పకూలి గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)