Breaking News

అగ్నివీరులకు శాశ్వత కొలువులు 

Published on Wed, 11/04/2026 - 15:28

సాక్షి, న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో యువతను తాత్కాలిక ప్రాతిపదికన నియమించేందుకు ఉద్దేశించిన ‘అగ్నిపథ్‌’పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఎంపికైన అగ్నివీరులను భవిష్యత్తులో రక్షణ దళాల్లో రెగ్యులర్‌ సైనికులుగా చేర్చుకొనేందుకు మార్గం సుగమం చేసింది. దేశంలో న్యాయ వ్యవస్థ బలోపేతం, పర్యావరణహిత ఇంధన వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ రంగానికి మద్దతుగా రూ.21 వేల కోట్లకు పైగా వ్యయం కానున్న పలు పథకాలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 


రెండేళ్ల పీరియడ్‌లో అధిక వేతనం  
అగ్నివీరుల పనితీరు అద్భుతంగా ఉందని రక్షణ దళాలు నివేదిక ఇచ్చాయి. సంస్థాగత అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాన్ని సమగ్రంగా అంచనా వేసిన అనంతరం వారిని శాశ్వతంగా నియమించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో ప్రకటించిన నిబంధనల ప్రకారం నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత ప్రతిభ(మెరిట్‌) ఆధారంగా 25 శాతం మంది అగ్నివీరులకు రక్షణ దళాల్లో శాశ్వత ఉపాధి(రెగ్యులర్‌ ఉద్యోగం) కల్పిస్తారు. తాజా కేబినెట్‌ నిర్ణయంతో మిగిలిన 75 శాతం మంది అగ్నివీరులకూ ప్రత్యామ్నాయం దొరికింది. సాయుధ దళాల సిఫార్సుల మేరకు ఈ 75 శాతం మంది సర్వీసును వారి అంగీకారంతో మరో రెండేళ్ల పాటు పొడిగించనున్నారు. 

ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టుల సంఖ్య పెంపు  
అత్యాచారాలు, పోక్సో కేసుల్లో సత్వర విచారణ కోసం 2019 అక్టోబర్‌ 2న ప్రారంభించిన ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టుల(ఎఫ్‌టీఎస్‌సీ) గడువును కేబినెట్‌ మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఈ కేంద్ర ప్రాయోజిత పథకం 2026 ఏప్రిల్‌ 1 నుంచి 2031 మార్చి 31 వరకు కొనసాగుతుంది. 

ఇతర నిర్ణయాలు:   ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ)కు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం రూ.10,700 కోట్ల ఈక్విటీ (మూలధన) సాయం.   గ్రిడ్‌–స్కేల్‌ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌ (ఈఎస్‌ఎస్‌) అభివృద్ధి కోసం రూ.14,500 కోట్లతో వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) పథకం.  ఈ నిధులతో దేశవ్యాప్తంగా 92 గిగావాట్‌ అవర్‌(జీడబ్ల్యూహెచ్‌) సామర్థ్యం గల స్టోరేజీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు.   దేశీయంగా లిథియం, నికెల్‌ లాంటి కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించేందుకు రూ.2,814 కోట్లతో ‘క్యాపెక్స్‌ సపోర్ట్‌ స్కీమ్‌’.  డేటా విశ్లేషణను ఆధునీకరించేందుకు ‘వికసిత్‌ భారత్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ స్టాటిస్టికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, అనలిటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌(విస్తార్‌)’ పథకం.
 

ఇదీ చదవండి: ట్రంప్‌కు డెమోక్రాట్లతో కొత్త చిక్కులు.. ఎంతవరకు అడ్డుకట్ట వేయగలరు?

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)