Breaking News

‘మీ పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్‌ బాటలో మధ్యప్రదేశ్‌

Published on Wed, 09/25/2024 - 18:23

ఉత్తరప్రదేశ్‌ బాటలో మధ్యప్రదేశ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్‌ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చినట్లు సమాచారం. 

ఉత్తరప్రదేశ్ మాదిరిగానే పరిశుభ్రమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించే ఉద్దేశ్యంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము’ అని పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించిన సమావేశంలో ఆహార లభ్యతపై ప్రజల్లో నెలకొన్న భయాలు, ఆందోళనలు పరిగణనలోకి  తీసుకున్న తర్వాతనే ఈ కొత్త నిబంధనల్ని అమలు చేయాలని భావించినట్లు విక్రమాదిత్య సింగ్‌ చెప్పారు. 

👉 చదవండి :  రాష్ట్రంలో సీఎం యోగి సర్కార్‌ కొత్త రూల్స్‌

యూపీ యోగి సర్కార్‌ సైతం
కాగా,మంగళవారం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత‍్యనాథ్‌ రాష్ట్రంలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందించేలా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హోటల్స్‌, రెస్టారెంట్లతో పాటు తినుబండరాలు అమ్మే ప్రదేశాల్లో యజమానులు, సిబ్బంది, చెఫ్‌లు తప్పని సరిగా మాస్క్‌లు, గ్లౌజ్స్‌ ధరించాలి. హోటల్స్‌, రెస్టారెంట్ల యజమానులు సిబ్బంది, ఇతర మేనేజర్లు ఇతర ఉద్యోగులు తప్పని సరిగా వారి వివరాల్ని మెనూ కార్డ్‌లో ప్రదర్శించాలని సీఎం యోగి ఆధిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే మధ్యప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Videos

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)