Breaking News

ఉదయ్‌పూర్‌ప్యాలెస్‌లో ఉద్రిక్తతలు.. మహారాజుకు నో ఎంట్రీ

Published on Tue, 11/26/2024 - 10:39

జైపూర్‌: రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో సోమ‌వారం ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రాజ్‌సమంద్‌ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వ‌రాజ్ సింగ్ మేవార్‌ను.. ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు. ఈ పరిణామంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి.

రాజ్‌పుత్‌ రాజు మహారాణా ప్రతాప్‌ వారసులైన మహేంద్ర సింగ్‌ మేవాడ్‌, అరవింద్‌ సింగ్‌ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాడ్‌ రాజ్య 77వ మహారాజుగా విశ్వ‌రాజ్ సింగ్‌ సోమవారం పట్టాభిషికం చేశారు. చిత్తోర్‌గఢ్‌ కోటలో ఈ కార్యక్రమం జరిగింది. 

ప‌ట్టాభిషేకం అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్‌ సింగ్‌.. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉదయ్‌పుర్‌లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు ఛైర్మన్‌, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.

ఉద‌య్‌పూర్‌కు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్యాలెస్‌, ఏకలింగనాథ్‌ ఆలయం ఈయన నియంత్రణలోనే నడుతుస్తున్నాయి. దీంతో మహారాజు విశ్వరాజ్‌ సింగ్‌ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లిన మహారాజును , అరవింద్‌ సింగ్‌ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. 

విశ్వరాజ్‌ మద్దతుదారులు బారికేడ్లను దాటుకొని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే విశ్వ‌రాజ్ త‌న మ‌ద్ద‌తుదారులతో క‌లిసి ప్యాలెస్ ముందు గ‌త రాత్రి 5 గంట‌ల పాటు నిలుచున్నారు. అనంతరం ఆయ‌న అభిమానులు, మ‌ద్దుతుదారులు ప్యాలెస్‌పై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్యాలెస్  లోప‌ల ఉన్న వ్య‌క్తులు కూడా రాళ్ల‌తో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయపూర్‌ ప్యాలెస్‌ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 

#

Tags : 1

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు