Breaking News

Lok Sabha Speaker Election: 1946 తర్వాత మళ్లీ ఇప్పుడే..

Published on Tue, 06/25/2024 - 13:03

న్యూఢిల్లీ, సాక్షి: దేశ చరిత్రలోనే తొలిసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్‌ పదవి విషయంలో అధికార-ప్రతిపక్ష కూటమికి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం.. ఇరు పక్షాల నుంచి అభ్యర్థులు నిలపడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో 78 ఏళ్ల తర్వాత.. అదీ స్వాతంత్ర దేశంలో తొలిసారి ఈ ఎన్నిక జరగబోతోంది.

దేశంలో.. 1925 ఆగస్టు 24న సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు.  ఆ ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్‌భాయ్‌ జె పటేల్‌ స్పీకర్‌గా నెగ్గారు. టి.రంగాచారియార్‌పై కేవలం రెండు ఓట్ల (58-56) తేడాతో ఆయన విజయం సాధించారు. 1925 - 1946 మధ్య ఆరుసార్లు స్పీకర్‌ పదవికి ఎన్నికలు జరిగాయి. అయితే.. 1946లో కాంగ్రెస్‌ నేత జి.వి.మౌలాంకర్‌ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. పార్లమెంటు(పాత పార్లమెంట్‌)గా మారింది. ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా మౌలాంకర్‌ స్పీకర్‌గా కొనసాగారు.

1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మాలంకర్‌ మరణంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న అయ్యంగార్‌.. స్పీకర్‌ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్‌గా అయ్యంగార్‌ నియమితులయ్యారు. 

అలా.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, బలరాం జాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ అధికార పక్షం తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షం తీసుకోవడం ఆనవాయితీగా వచ్చింది. యూపీఏ హయాంలో కూడా విపక్షాలకు డిప్యూటీ ఇచ్చారు. 

అయితే.. 2014లో ఆ ఆనవాయితీని ఎన్డీయే కూటమి బ్రేక్‌ చేసింది. తన మిత్రపక్షానికి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చుకుంది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో నెగ్గడంతో మిత్రపక్షానికి కూడా ఇవ్వకుండా ఆ పోస్టును ఖాళీగా ఉంచింది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో లోక్‌సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు