‘ప్రయాగ్‌రాజ్‌’కు పోటీగా నాసిక్‌ కుంభమేళా

Published on Sat, 03/29/2025 - 12:34

నాసిక్: ఇటీవలే యూపీలోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో అత్యంత వైభవంగా మహాకుంభమేళా జరిగింది. ఇప్పుడు దీనికి పోటీనిచ్చే రీతిలో మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా జరగనుంది. దీనికి త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళాగా నామకరణం చేయనున్నారని తెలుస్తోంది.

ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Chief Minister Devendra Fadnavis) నాసిక్‌లో పర్యటించిన తరువాత 2027లో నాసిక్‌లో జరగబోయే కుంభమేళాకు సన్నాహాలు ఊపందుకున్నాయి. అయితే ఈ మేళాకు తగిన పేరు పెట్టే విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా త్రయంబకేశ్వర్ అఖాఢాల ప్రతినిధులు ఈ ఉత్సవానికి త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళా అనే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో నాసిక్ అఖాఢాల నేతలు ఈ కుంభమేళా పేరును నాసిక్ కుంభమేళాగానే  కొనసాగించాలని కోరారు.

నాసిక్ అఖాడాల సాధువులు సింహస్థ కుంభమేళా అథారిటీలో తమను భాగస్వాములను చేయాలని, కుంభమేళా  నిర్వహణకు 500 ఎకరాలకు పైగా భూమిని శాశ్వతంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ జలజ్ శర్మ మాట్లాడుతూ నాసిక్‌ కుంభమేళా పేరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. రికార్డులను తనిఖీ తర్వాత ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. నాసిక్‌లో 2027  జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య గోదావరి నది ఒడ్డున జరగనుంది. ఇది 12 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర జలవనరులు, విపత్తు నిర్వహణ మంత్రి గిరీష్ మహాజన్ కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు త్రయంబకేశ్వర్‌ను సందర్శించారు. సాధువులు, మహంతుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాకు ధీటుగా నాసిక్‌ కుంభమేళాను నిర్వహించాలని మహారాష్ట్ర సర్కారు(Government of Maharashtra) యోచిస్తోంది.

ఇది కూడా చదవండి: Nepal: మాజీ రాజు జ్ఞానేంద్ర షా అరెస్టుకు రంగం సిద్ధం?

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)