Breaking News

మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం

Published on Wed, 08/23/2023 - 21:27

బెంగళూరు: తక్కువ ఖర్చుతో అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ISRO మరో అడుగు వేయబోతోంది. చంద్రుడిపై చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సక్సెస్‌ ఆస్వాదిస్తూనే.. మరో కీలక ప్రయోగంపై ఇస్రో ప్రకటన చేసింది. ఈసారి ఏకంగా సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమని స్పష్టం చేసింది. 

తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధమైంది. ఆదిత్య ఎల్‌-1 Aditya L1 పేరుతో సన్‌ మిషన్‌ ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారాయన. 

ఆదిత్య ఎల్‌1 ISRO Sun Mission ప్రయోగంలో కరోనాగ్రాఫీ స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమికి సూర్యుడికి మధ్య ఎల్‌1 పాయింట్‌ చుట్టూ ఒక హాలో ఆర్బిట్‌లో చొప్పిస్తారు. సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులు.. భూమి చుట్టూ ఉన్న పర్యావరణంపై దాని ప్రభావం తదితర అంశాలపై ఇది అధ్యయనం చేస్తుంది. 

ఇస్రో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను దేశంలోని వివిధ పరిశోధన సంస్థల సహకారంతో తయారు చేసింది. పీఎస్‌ఎల్వీ-ఎక్సెల్‌(సీ 57) ద్వారా షార్‌ శ్రీహరికోట నుంచే ఈ ప్రయోగం చేపట్టనుంది. ఐదేళ్లపాటు లక్ష్యంగా ఆదిత్య ఎల్‌1 సన్‌ మిషన్‌ కొనసాగించాలని ఇస్రో భావిస్తోంది. 

ఇదీ చదవండి: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సూపర్‌ సక్సెస్‌.. సాగిందిలా!

#

Tags : 1

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు