Breaking News

అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం

Published on Mon, 10/16/2023 - 09:40

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈనెల 7వ తేదీన శక్తివంతమైన భూకంపం చోటుచేసుకున్న హెరాట్‌ ప్రావిన్స్‌లోనే ఆదివారం మళ్లీ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం హెరాట్‌ ప్రావిన్స్‌ రాజధాని హెరాట్‌ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో భూమికి 8 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.

తాజా భూకంపం తాకిడికి నలుగురు చనిపోగా మరో 150 మందికి పైగా గాయపడినట్లు స్వచ్చంద సంస్థలు తెలిపాయి. బలోచ్‌ ప్రాంతంలోని రబట్‌ సాంగి జిల్లాలోని కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నట్లు చెబుతున్నారు.

ఈ నెల 7న భూకంపం సంభవించిన హెరాట్‌ ప్రావిన్స్‌లో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. మొత్తం 2 వేల మందికి పైగా చనిపోగా మృతుల్లో 90 శాతం వరకు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)