Breaking News

ప్రతికూల వాతావరణం.. 80 శాతం రైతులు కుదేలు

Published on Wed, 06/26/2024 - 07:33

ఊహకందని రీతిలో మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులను నిరాశలోకి నెట్టేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులతో రైతులు భారీ స్థాయిలో పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు.

గత ఐదేళ్లలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశంలో 80 శాతం మంది రైతులు తమ పంటలను నష్టపోయారు. పలు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో నాట్లు వేయడం, విత్తనాలు విత్తడంలో జాప్యం జరుగుతున్నదని, ఇది పంటల దిగుబడిపై ప్రభావం చూపుతున్నదని నిపుణులు అంటున్నారు. ఫోరమ్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఫర్ ఈక్విటబుల్ డెవలప్‌మెంట్ (ఫీడ్) తాజాగా విడుదల చేసిన నివేదికలో దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.

దేశంలోని 21 రాష్ట్రాల్లోని 6,615 మంది రైతుల నుంచి ఫీడ్‌ పలు వివరాలు సేకరించింది. దేశంలో సంభవించిన పంట నష్టాల్లో 41 శాతం కరువు కారణంగా, 32 శాతం సక్రమంగా  వర్షాలు కురియక, 24 శాతం రుతుపవనాల ముందస్తుగా లేదా ఆలస్యంగా వచ్చిన కారణంగా సంభవించినట్లు ఫీడ్‌ సర్వేలో తేలింది.

సర్వేలో పాల్గొన్న రైతులలో 43 శాతం మంది తమ పంటలో కనీసం సగం పంట నష్టపోయామని తెలిపారు. ముఖ్యంగా వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు అధిక వర్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వరి పొలాల్లో కొత్తగా నాటిన మొక్కలకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా తక్కువ వర్షపాతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్,  ఉత్తరప్రదేశ్‌లను ప్రభావితం చేసింది. బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, వేరుశనగ తదితర పంటల విత్తనాలు నాటడంలో ఆలస్యం జరిగింది. ఇది పంట దిగుబడులపై ప్రభావం చూపనున్నదని నిపుణులు అంటున్నారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు