Breaking News

కరూర్‌ బాధితులకు విజయ్‌ ఓదార్పు

Published on Tue, 10/28/2025 - 05:53

సాక్షి, చెన్నై: కరూర్‌ బాధిత కుటుంబాలను తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ ఓదార్చారు. ఆ కుటుంబాలను చెన్నై శివారులోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్ట్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రాణనష్టంపై ఆయన కంటతడి పెట్టారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి తలా రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. గత నెల 27న కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ నిర్వహించిన ప్రచారం పెను విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 41 మంది మరణించారు.160 మంది గాయపడ్డారు.

ఈ కుటుంబాలను కరూర్‌కు వెళ్లి పరామర్శించేందుకు తొలుత విజయ్‌ నిర్ణయించారు. అయితే, అనుమతుల మంజూరు, స్థల ఎంపిక సమస్యలు నెలకొనడంతో చివరకు బాధిత కుటుంబాలను చెన్నైకు పిలిపించి ఒకే చోట పరామర్శించేందుకు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో 8 కుటుంబాలు గైర్హాజరైనా మిగిలిన కుటుంబాలన్నీ చెన్నైకు వచ్చేందుకు సమ్మతించాయి. వీరందర్నీ ప్రత్యేక బస్సుల్లో చెన్నైకు తీసుకొచ్చారు. మహాబలిపురంలోని రిసార్ట్‌లో బస ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒక్కో కుటుంబాన్ని విజయ్‌ వేర్వేరుగా పరామర్శించారు.

15 నుంచి 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఆప్యాయంగా వారిని పలకరిస్తూ ఓదార్చారు. ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల్లోని పిల్లల చదవులకు అండగా ఉంటానని, ఖర్చులు భరిస్తానని విజయ్‌ హామీ ఇచ్చినట్టు సమాచారం. మరికొన్ని కుటుంబాల్లోని వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు కూడా హామీ ఇచ్చారని తెలిసింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)