Breaking News

Tamannaah Bhatia: తమన్నాను ప్రశ్నించిన ఈడీ

Published on Fri, 10/18/2024 - 06:08

గువాహటి: బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని హెచ్‌పీజెడ్‌ టోకెన్‌ యాప్‌లో చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో నటి తమన్నా భాటియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం ప్రశ్నించారు. యాప్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి నేరసంబంధ కేసు నమోదుకాలేదని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

 యాప్‌ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులుకాగా రెండు సంస్థలను విదేశీయులు నడిపిస్తున్నారు. బిట్‌కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్‌ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని యాప్‌పై కోహిమా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు.

 ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్, బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57వేల పెట్టుబడికి మూడు నెలలపాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తుచేసింది. అసలు డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్‌ ఖాతాలు, మర్చెంట్‌ ఐడీలు తీసుకున్నారని తేలింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)