Breaking News

కాంగ్రెస్‌ హిమానీ హత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ వీడియో

Published on Tue, 03/04/2025 - 08:56

ఢిల్లీ: హర్యానాకు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు హిమానీ నర్వాల్‌ హత్య కేసులో కీలక ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే సచిన్‌ అనే నిందితుడిని అరెస్టు చేశారు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇక, తాజాగా నిందితుడు హిమానీ హత్యకు గురైన రోజున ఆమె నివాసం సమీపంలో నుంచి సూటుకేసును తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

హర్యానాలో రోహ్‌తక్‌ జిల్లాలోని సాంప్లా బస్టాండ్‌ సమీపంలో మార్చి ఒకటో తేదీన సూట్‌కేసులో హిమానీ నర్వాల్‌ మృతదేహం బయటపడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హిమానీ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం సచిన్‌ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం, హిమానీ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడు ఓ సూట్‌కేసును పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 28న రాత్రి 10 గంటల సమయంలో హిమానీ నివాసం సమీపం నుంచి అతడు వెళ్లడం గుర్తించారు. మరుసటి రోజు ఉదయం అదే సూట్‌కేసులో ఆమె మృతదేహం ఉండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో హిమానీ నర్వాల్‌ తన ఇంట్లోనే హత్యకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమెతో తనకు సన్నిహిత సంబంధం ఉందని నిందితుడు చెప్పుకొచ్చారు. అలాగే, తనను తరచూ డబ్బులు డిమాండ్‌ చేయడంతోనే హత్య చేసినట్టు సచిన్‌ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక, వారిద్దరు స్నేహితులని, నిందితుడికి ఇప్పటికే వివాహమైందని పోలీసులు తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)