Breaking News

జేఎన్‌యూలో పట్టు నిలబెట్టుకున్న వామపక్షం 

Published on Tue, 04/29/2025 - 05:22

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్షాలు మరోమారు సత్తా చాటాయి. కీలకమైన నాలుగు పదవులకు గాను మూడింటిని కైవసం చేసుకున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ ఏబీవీపీకి తొమ్మిదేళ్ల తర్వాత జాయింట్‌ సెక్రటరీ పోస్టు దక్కించుకోగలిగింది. 

జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషన్‌ సోమవారం ఉదయం ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్‌ పదవిని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ)కు చెందిన నితీశ్‌ కుమార్‌ గెలుచుకున్నారు. ఈయనకు 1,702 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి ఏబీవీపీకి చెందిన శిఖా స్వరాజ్‌కు 1,430 ఓట్లు దక్కాయి. ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన తయ్యబా అహ్మద్‌ 918 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 

వైస్‌ ప్రెసిడెంట్‌గా డెమోక్రాటిక్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(డీఎస్‌ఎఫ్‌)బలపరిచిన మనీ షా 1,150 ఓట్లతో విజయం సాధించారు. ఏబీవీపీ అభ్యర్థికి 1,116 ఓట్లు దక్కాయి. జనరల్‌ సెక్రటరీ పదవిని గెలుచుకున్న డీఎస్‌ఎఫ్‌కు చెందిన ముంతేహా ఫతిమాకు 1,520 ఓట్లు రాగా ప్రత్యర్థి, ఏబీవీపీకి చెందిన కునాల్‌ రాయ్‌కి 1,406 ఓట్లొచ్చాయి. అదేవిధంగా, ఏబీవీపీ అభ్యర్థి వైభవ్‌ మీనా 1,518 ఓట్లతో జాయింట్‌ సెక్రటరీ పదవిని గెలుచుకున్నారు. సమీప ప్రత్యర్థి ఏఐఎస్‌ఏకు చెందిన నరేశ్‌ కుమార్‌కు 1,433 ఓట్లు, ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌(పీఎస్‌ఏ) అభ్యర్థి నిగమ్‌ కుమారికి 1,256 ఓట్లు పడ్డాయి.

2015–16 తర్వాత
చిట్టచివరిసారిగా 2015–16 జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి సౌరవ్‌ శర్మ జాయింట్‌ సెక్రటరీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆ పదవి దక్కడం ఇదే మొదటిసారి. అదేవిధంగా, 2000–01 ఎన్నికల్లో ఏబీవీపీకి చెందిన సందీప్‌ మహాపాత్ర జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్‌ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఏబీవీపీ ఆ పదవిని ఇప్పటి వరకు గెలుచుకోలేకపోయింది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)